ఐఫోన్‌ 6 యూజర్లకు ఎర్రర్‌ 53 టెన్షన్

Error 53 Problem For iPhone6 Users

10:12 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Error 53 Problem For iPhone6 Users

యాపిల్ ఐఫోన్ 6 యూజర్లను కొత్త టెన్షన్ పట్టుకుంది. కొత్తగా వచ్చిన ఐఓఎస్‌9తో అప్‌గ్రేడ్‌ చేస్తే ఇక మీ ఫోన్ పని అయిపోయినట్టే. ఎందుకంటే మీ ఫోన్‌ ను ఎప్పుడైనా యాపిల్‌ ఇంజినీర్లతో కాకుండా థర్డ్‌పార్టీ వారితో రిపెయిర్ చేయిస్తే అలాంటి ఐఫోన్‌లను ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ డిజేబుల్‌ చేస్తోందట. దీంతో ఫోన్‌ పనిచేయకుండా పోతోంది. ఇప్పటికే యూఎస్‌లో చాలామంది ఫోన్లు పనిచేయకుండా మొరాయిస్తున్నాయి. ఐఫోన్‌ 6ను కొత్త సాఫ్ట్‌వేర్‌ ఐఓఎస్‌9తో అప్‌గ్రేడ్‌ చేసిన తర్వాత గతంలో ఫోన్‌ను రిపేర్‌ చేశారా లేదా గుర్తిస్తుంది. అధీకృత యాపిల్‌ ఇంజినీర్‌ కాకుండా థర్డ్‌పార్టీ ఇంజినీర్లతో మరమ్మతు చేయిస్తే వెంటనే ఎర్రర్‌ 53 సందేశాన్ని చూపిస్తోంది. మళ్లీ మీ పాత ఓఎస్‌ కోసం రీస్టోర్‌ చేసినా అంతే సంగతులు. దీనిని యాపిల్‌ కూడా ధ్రువీకరించింది. కాగా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు యాపిల్‌ సపోర్ట్‌ను సంప్రదించాలని సంస్థ సూచించింది.

English summary

Error 53 problem appeared after an iOS software update and seemed to affect devices with replaced or damaged home buttons and Touch ID sensors