విషానికి విరుగుడు ఈ మొక్కలు

Eswara Mooli plants to destroy poison

12:38 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Eswara Mooli plants to destroy poison

దిండుగల్ జిల్లా గాంధీ గ్రామ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగ పరిశోధకులు విషానికి విరుగుడునిచ్చే ఈశ్వరమూలి అనే కొత్త ఔషధ మొక్కను గుర్తించారు. ఈ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగానికి చెందిన మంజుల అంతర్జాతీయ స్థాయిలో ఔషధ గుణాలున్న మొక్కలను గుర్తించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పొందే ప్రయత్నాలలో దిగారు. రెండేళ్ల క్రితం ఎతియోఫియా, ఎరిత్రియ తదితర దేశాలకు వెళ్లి అక్కడి ప్రజలు వాడే ప్రకృతి వైద్యంపై పరిశోధనలు చేశారు. దేశానికి తిరిగి వచ్చిన ఆమె ప్రస్తుతం కోయంబత్తూర్ జిల్లా వెల్లయ్యంగిరి కొండ పశ్చిమ కనుమల్లో నివసించే గిరిజనుల గ్రామాలలో పర్యటించి వారి వైద్య విధానాల గురించి వివరాలు సేకరిస్తున్నారు. అంతే కాకుండా గాంధీ గ్రామ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విషానికి విరుగుడునిచ్చే ఈశ్వరమూలి, ఒరిత్తల్ తామరై, పిలకారనై, విరాలి, కుండ్రిమణి వంటి ఐదు రకాల మొక్కలను గుర్తించారు.

English summary

Eswara Mooli plants to destroy poison