వాటర్‌ మేనేజ్‌మెంట్‌ లో భారత్‌కు ఈయూ సాయం

EU to help India In Water Management

04:40 PM ON 17th December, 2015 By Mirchi Vilas

EU to help India In Water Management

తాగునీటి నిర్వహణ(వాటర్‌ మేనేజ్‌మెంట్‌) విషయంలో భారతదేశానికి సాయం చేసేందుకు యూరోపియన్‌ యూనియన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లో కొత్తగా నియమితులైన యూరోపియన్‌ యూనియన్‌ రాయబారి తోమాస్జ్ కోజ్‌లోవ్‌స్కీ ఈ విషయాన్ని ప్రకటించారు. భారత జలవనరుల శాఖామంత్రి ఉమాభారతిని యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధులు కలిసారని ఆయన తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌లో కొన్ని దేశాలు కూడా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయని.. ఆ సమస్యల నుంచి తాము ఎన్నో పరిష్కారాలు కనుగొన్నామని అవి భారతదేశానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన వివరించారు. నీటి నిర్వహణకు సంబందించి భారత్‌ చేపడుతున్న అన్ని ప్రధాన కార్యక్రమాల్లోను సాయం చేయాలని ఈయూ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్లీన్‌ ఇండియా, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, డిజిటల్‌ ఇండియా తదితర కార్యక్రమాల్లో కూడా తమ భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధి వంటి అంశాల్లో కూడా కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు యూరోపియన్‌ యూనియన్‌ రాయబారి తెలిపారు.

English summary

European Nation (EU) has said that it was going to help India in Water Management. This was said by EU Ambassador