64 జీబీ ర్యామ్.. 5 టీబీ ఎస్ఎస్డీ తో ల్యాప్ టాప్

Eurocom Laptop With 64GB RAM, 5TB SSD

06:40 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Eurocom Laptop With 64GB RAM, 5TB SSD

1 జీబీ.. 2 జీబీ.. 4 జీబీ.. మహా అయితే 10 జీబీ ర్యామ్ ఉండే ల్యాప్ టాప్ లు మనకు తెలుసు. కానీ ఈ ల్యాప్ టాప్ లో ర్యామ్ ఎంతో తెలుసా.. అక్షరాలా 64 జీబీ. అంతే కాదు ఇందులో స్టోరేజ్ కూడా కాస్త హై రేంజ్ లోనే ఉంటుంది. 5 టీబీ ఎస్ఎస్డీ అంటే సుమారు 5000 జీబీ స్టోరేజ్ అన్న మాట. ఇందకీ ఈ ల్యాప్ టాప్ ఖరీదు ఎంతనుకుంటున్నారు జస్ట్ రూ. 7.75 లక్షలే. చాలా కాస్ట్ లీ కదా.. మరి ఇన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నప్పుడు ఆ మాత్రం ఖరీదు ఉండటం తప్పులేదు కదా. కెనడాకు చెందిన యూరోకామ్ సంస్థ‌ స్కై ఎక్స్9డబ్ల్యూ పేరిట గత ఏడాది అక్టోబర్‌లో మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు అంతర్జాతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కాస్త తక్కువ స్పెసిఫికేషన్లతోనూ ఈ ల్యాప్ టాప్ లభిస్తోంది. అయితే దానికి కూడా సుమారు రూ.2 లక్షల వరకు చెల్లించాల్సిందే.

స్కై ఎక్స్9డబ్ల్యూ ఫీచర్లు ఇవే..

17.3 ఇంట్ 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్ ప్లే, 3840 X 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఇంటెల్ కోర్ ఐ7 స్కైలేక్-ఎస్ 6700కె క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఇంటెల్ జడ్170 ఎక్స్‌ప్రెస్ స్కైలేక్ చిప్‌సెట్, 8 జీబీ ఎన్‌వీడియా క్వాడ్రో ఎం5000ఎం గ్రాఫిక్స్ కార్డ్, ధరను బట్టి 16 జీబీ నుంచి 64 జీబీ డీడీఆర్4 ర్యామ్ వరకు, యూఎస్‌బీ 3.1 టైప్-సి పోర్ట్, 6 యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ పోర్ట్, వైఫై, 5 టీబీ (5వేల జీబీ) ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ (హార్డ్‌డిస్క్), విండోస్ 10/విండోస్ 8.1/ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌లు

English summary

Eurocom launched a new laptop named Sky X9W laptop with 64GB RAM, 5TB SSD, and 6 USB Ports.The price of this laptop was 64GB RAM, 5TB SSD, and 6 USB Ports.