వివాహితను వెంటాడి చంపేసిన పోకిరీలు

Eve teasers killed a married girl

06:05 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Eve teasers killed a married girl

విశాఖలో పోకిరీలు రెచ్చిపోయారు. లావణ్య అనే వివాహితను దారుణంగా ఏడిపించారు. ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను వెంబడించి ఢీకొట్టడంతో కిందపడిన ఆమె తీవ్రగాయాల పాలైంది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనలో ఆమె భర్తతో పాటు.. మరదలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. పోకిరీలు కారులో వెంబడిస్తూ ఆమెను అసభ్యకరమైన మాటలతో వేధించినట్లు తెలుస్తోంది. కారుతో వెనుక నించి బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ అదుపుతప్పి పడిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Eve teasers killed a married girl