ఎంత పెద్ద వీఐపీ అయినా ఈ కుర్రాడిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాల్సిందే(ఫోటోలు)

Every Celebrity Have To Take Appointment To Meet This 14 Year Old Guy Rashed

11:27 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

Every Celebrity Have To Take Appointment To Meet This 14 Year Old Guy Rashed

పెద్ద సినిమా స్టార్ అయినా, స్పోర్ట్స్ స్టార్ అయినా, ఎంత పెద్ద వీఐపీ అయినా సరే, ఈ కుర్రాడిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాల్సిందే. ఇంతకీ ఈ కుర్రాడి వయసు 14 ఏళ్లే. అలాగని ఏ దేశాధ్యక్షుడి మనవడో, ప్రధాని కొడుకో కాదు. మరి ఈ కుర్రాడికి అంత డిమాండ్ ఏమిటి? ఇతడ్ని కలవడానికి అపాయింట్మెంట్ ఎందుకు? అదీ వీఐపీలకు కూడానా? అని ఆశ్చర్య పోకండి. ఇతను రేంజ్ అలాంటిది మరి. ఇంతకీ ఎవరు ఏమిటి అనుకుంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

దుబాయ్ లోని ప్రముఖ పారిశ్రామిక వేత్త సైఫ్ అహ్మద్ బెల్హసాకు రషీద్ అనే 14 ఏళ్ల కొడుకున్నాడు. సాధారణంగా ఈ వయసు పిల్లలంతా స్కూల్కు వెళుతూ, ఖాళీ సమయంలో వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. కానీ రషీద్ అలా చేయలేదు. చిన్న వయసులోనే ఎంటర్ప్రెన్యూర్గా మారాడు. తన తండ్రితో కలిసి ఫ్యాషన్లైన్ ఏర్పాటు చేశాడు. సెలబ్రెటీలను ఆకర్షించే స్నికర్స్ను తయారు చేయించాడు. ఇతడి స్నికర్ కలెక్షన్ చూసిన ఈ స్టార్ అయినా వాటిపై మనసుపారేసుకోవాల్సిందే.

దుబాయ్ కు వెళ్లే ప్రతి సెలబ్రెటీ రషీద్ ఫ్యాషన్లైన్ను తప్పకుండా సందర్శిస్తారట. దీంతో రషీద్ ఇప్పటికే చాలామంది సూపర్ స్టార్స్, అథ్లెట్స్‌ను కలిశాడట. జాకీచాన్, పారిస్ హిల్టన్, క్రిస్టియానో రొనాల్డో నుంచి బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వరకు అందరినీ పలకరించాడు. ఈ స్టార్లందరూ రషీద్‌ను డైరెక్ట్‌గా కలవలేదట. ముందుగానే అతడి పీఏతో అపాయింట్మెంట్ తీసుకుని, ఆ తర్వాతే రషీద్‌ను కలిశారట.

రషీద్ కొన్ని ప్రత్యేకమైన పులులను కూడా పెంచుకుంటున్నాడట. ఈ మధ్యనే ఓ తెల్లపులిని ఇంటికి తీసుకొచ్చాడట. తనను కలవడానికి వచ్చే సెలబ్రెటీలకు ప్రత్యేకమైన పులులను చూపించి వాళ్లకు గుర్తుండిపోయే మధురానుభూతులను పంచుతున్నాడట. అపాయింట్‌మెంట్ తీసుకుని ఈ కుర్రాడిని కలిసిన స్టార్ల ఫొటోలపై ఓ లుక్కెయ్యండి.

1/13 Pages

English summary

A 14 year old boy named Rashed Belhasa and he was the son of one of the entrepreneurs and power couple Saif and Sara Belhasa. This boy was a celebrity world wide and every celebrity who comes to Dubai will meet Rashed and they have to take Appointment of this Guy Also.