వరల్డ్ ఛాంపియన్ ని చంపేసిన ప్రభుత్వం!

Every Indian have to know about the Budhia

03:33 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Every Indian have to know about the Budhia

నాలుగేళ్ళ వయసులోనే 65 కిలోమీటర్లు పరుగెత్తి ప్రంపంచంలోనే అతి చిన్న వయసులో మారథాన్ రన్నింగ్ చేసిన బుడతడిగా రికార్డులని సృష్టించాడు. అతడే బుధియా... అతడు పెద్దయ్యాక మన దేశానికి మారథాన్ రన్నింగ్ లో ఒలంపిక్ పతకం ఖచ్చితంగా తీసుకొస్తాడని అప్పట్లో అందరూ భావించారు, కానీ ఇప్పుడు బుధియా గురించి, అందరు మరిచిపోయారు, ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవుతాడు అనుకున్న బుదియా ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..? 2002లో అంత్యంత పేద కుటుంబంలో బుధియా సింగ్ జన్మించాడు. పుట్టిన కొన్ని రోజులకే బుధియా తండ్రి చనిపోయాడు, కొడుకుని పోషించలేని తల్లి బుధియాని 800 రూపాయలకి అమ్మేసింది, బుధియాని కొనుక్కున్న వారు సరిగా చూసుకోవట్లేదని బుధియా తల్లి తెలుసుకుని, బిరంచి దాస్ అనే వ్యక్తి సహాయంతో వారికి 800 ఇచ్చి తిరిగి బిడ్డను వెనక్కి తీసుకుంది. 

1/6 Pages

జూడో కోచ్ అయిన బిరంచి అనాధ పిల్లలని పెంచుకుంటుంటాడు. ఆ క్రమంలో బుధియాని కూడా చేరదీశాడు. ఒకరోజు బుధియా ఏదో తప్పు చేసినందుకు గ్రౌండ్ చుట్టూ పరిగెత్తమన్నాడు, బుధియా గ్రౌండ్ చుట్టూ పరుగులు తీస్తూనే ఉన్నాడు, ఒక 5 గంటల తరువాత బిరంచికి గుర్తుకొచ్చి గ్రౌండ్ కి వచ్చి చూస్తే బుధియా ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు, మూడేళ్ళ పిల్లాడు, ఆగకుండా 5 గంటలు పరుగెత్తడం ఆశ్చర్యం కలిగించింది. వెంటనే బుధియాని ఆస్పత్రికి తీసుకెళ్ళి పరీక్ష చేయించాడు. అతని గుండె బానే ఉంది. బుదియా గుండె దమ్ము చూసిన బిరంచి అప్పటి నుండి అతనికి రన్నింగ్ లో శిక్షణ ప్రారంభించాడు.

English summary

Every Indian have to know about the Budhia