ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలట

Every Movie Have To Do Carefully Says Nani

10:12 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Every Movie Have To Do Carefully Says Nani

భలే భలే మాగాడివోయ్ సినిమాతో క్రేజ్ పెంచేసుకున్న నాని ఇప్పుడు ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మించారు. మెహరీన హీరోయిన్ గా నటించింది. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నాని చెప్పే మాటలు వినాల్సిందే. ' వరుసగా రెండు హిట్లొచ్చాయి కాబట్టి ఇప్పుడు టెన్షన పడాల్సిన పని లేనే లేదు. అదే ఫ్లాపుల్లో ఉంటే ఇదేమవుతుందనే టెన్షన్... మరి ఇప్పుడస్సలు అలాంటి భయం లేదు. ఇక ఈ సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు పక్కన పెడితే, ఇప్పుడు ఏ సినిమాకి ఆ సినిమాయే ఓ యుద్ధం అనుకోండి. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండి తీరాల్సిందే. వంద శాతం ఎఫర్ట్‌ పెట్టాల్సిందే. అలా ప్రతి సినిమాకూ నిరూపించుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం ఎప్పుడైనా సరే, ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందే. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు' అంటూ నాని పెద్ద పెద్ద మాటలే చెప్పేస్తున్నాడు.

English summary

One of the Most Talented Hero in Tollywood Nani says has to work very care full to each and every film.His latest movie Krishna Gadi Veera Prema Gaadha Movie was going to be released on this week