స్కూళ్ళలో శుభ్రత పాటించాల్సిందే : ఆప్‌ 

Every School in Delhi Must Be Clean And Neat Says Aap Govt

01:32 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Every School in Delhi Must Be Clean And Neat Says Aap Govt

ఢిల్లీ లోని పాఠశాలల యజమాన్యాలను ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి స్కూలు లోను శుభ్రత పాటించల్సిందేనని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అన్నారు. అలా శుభ్రత పాటించని పక్షంలో స్కూళ్ళు గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.

డిసెంబరు 10 వ తేది లోగా ప్రతి పాఠశాల శ్రుభంగా ఉండాలని హుక్కుం జారీ చేశారు. స్కూలు మేనేజ్‌మెంట్‌ కమిటి వారు ఢిల్లీ వ్యాప్తంగా స్కూళ్ళ పై ఆకస్మిక తనిఖిలు చేపడతారని ఢిల్లీ ఉనముఖ్యమంత్రి మనిష్‌ సిసోడియా అన్నారు. ఈ విధంగా నిబంధనలను పాటించని స్కూళ్ళ గుర్తింపును రద్దు చెయ్యడమే కాక ఆ స్కూళ్ళ పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి విద్యార్ధిని అపరిశుభ్రమైన క్లాస్‌ రూంలలో కూర్చోబెట్టి , మురికిగా ఉన్న మైదానాల లో చెత్తా చెదారం మధ్యలో ఉండేలాగా స్కూళ్ళు చేస్తున్నారాని ఆయన అన్నారు. స్కూళ్ళ వాతావారణం శుభ్రంగా ఉంటే అందులోని విద్యార్ధులు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉంటారని అయన అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ ప్రభుత్వం ప్రతి స్కూల్ యాజమాన్యాన్ని తమ స్కూళ్ళను, స్కూళ్ళ పరిరాలను శుభ్రంగా ఉంచాలని సూచించింది. ప్రతి స్కూలు యాజమాన్యం కూడా తమ స్కూళ్ళను శుభ్రం చేసి దాని తాలుకా ఫోటోలను ఢిల్లీ స్వచ్ఛతా వెబ్‌పేజ్‌లో పెట్టాలని అన్నారు.

English summary

Each and every school in delhi must be clean and neat by december 10 said by delhi's Deputy Chief Minister Manish Sisodia