డాక్టర్లు చేసే ఈ తప్పు వల్ల ఏటా లక్ష మంది చనిపోతున్నారట!

Every year 1 lakh people is expiring for doctor's mistake

11:28 AM ON 29th September, 2016 By Mirchi Vilas

Every year 1 lakh people is expiring for doctor's mistake

వైద్యో నారాయణో హరిః అన్నారు పెద్దలు. ఎందుకంటే వైద్యుడు దేవుడితో సమానం అంటారు. అసలు వైద్యుడు లేని ప్రపంచాన్ని ఊహించగలమా? జలుబు నుంచి గుండె పోటు దాకా దేన్ని నయ్యం చేయాలన్నా వైద్యుడు కావాలి. కాని అలాంటి వైద్యుడే మన పాలిట యమునిగా మారితే? అవును, డాక్టర్లు చేసే పొరపాటు కారణంగా అమెరికాలో ఏటా 7000 మంది చనిపోతున్నారట. వివరాల్లోకి వెళ్తే.. మనకు గాని, మన కుటుంబసభ్యులకు గాని చిన్న తల నొప్పి లాంటిది రావడం సహజం. అయితే అది వచ్చిన వెంటనే, ఉరుకుల పరుగుల మీద డాక్టర్ ను సంప్రదిస్తాం. అక్కడ డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లో వారానికి సరిపడా మందులు రాస్తాడు. ఆ మందులు ఒక్క రోజు వాడి మిగితావి పారేస్తాం.

కాని నిజానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో రాసిన మందులే వాడుతున్నారా? లేక మందుల షాపువాడు వేరే మందులేమైనా ఇస్తున్నాడా? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇందులో మందుల షాపు వారి తప్పేమీ లేదులెండి. ఎందుకంటే డాక్టర్ల చేతి రాత(హ్యాండ్ రైటింగ్) వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ పొరపాటు వల్ల అమెరికాలో సంవత్సరానికి 7 వేల మందికి పైగా చనిపోతుంటే... దాదాపు 1.5 మిలియన్ మంది ఆరోగ్యం దెబ్బతింటుందట. ఈ విషయాన్ని ఇన్స్టిట్యూట్ అఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు నిర్ధారించారు. ఇక ప్రపంచమంతా లెక్కేస్తే ఈ సంఖ్య లక్షకు మించే ఉంటుందంటున్నారు. ఇక మీదట డాక్టర్ను సంప్రదించేటప్పుడు జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు కంప్యూటరైజ్డ్ ప్రింట్ తీసుకుంటే మంచిది. అది కుదరకపోతే డాక్టర్ హ్యాండ్ రైటింగ్ మీకు అర్ధమవుతుందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. అర్ధం కాకపోతే మరోసారి అర్ధమయ్యేలా రాసి ఇవ్వమనండి. లేకపోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే.

English summary

Every year 1 lakh people is expiring for doctor's mistake