ప్రతీ ఏడాది 'శ్రీరామ నవమి' ముందు రోజు వర్షం.. ఎక్కడో తెలుసా?

Every year raining before one day of Sri Rama Navami

03:37 PM ON 15th April, 2016 By Mirchi Vilas

Every year raining before one day of Sri Rama Navami

హిందువులు ఎంతో ఇష్టంగా కొలుచుకునే దేవుడు శ్రీరామ చంద్రుడు. ఆయన్ని మగ వాళ్ళ కంటే ఆడ వాళ్లే ఎక్కువ పూజిస్తారు. ప్రతీ ఆడది శ్రీరామ చంద్రుడి లాంటి భర్త తన జీవితంలోకి రావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుటున్నాం అంటే ఈ రోజు ఆ దేవుడు పండగ, అంటే ఈ రోజు 'శ్రీరామ నవమి' అని అందరికీ తెలిసిందే. అయితే ప్రతీ సంవత్సరం సరిగ్గా శ్రీరామ నవమి ముందు రోజు ఒక వింత జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.

ఒక పక్క భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాలు సొమ్మసిల్లిపోతుంటే.. మరో వైపు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండల పరిధి రాచలూరు, లేమూరు, కందుకూరు, మకాన్‌ తదితర గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం ఓ మోస్తరు గా వాన కురిసిందట. మామూలుగా అయితే ఇది పెద్దగా పట్టించుకునే విషయమేమీ కాదు. కానీ.. ఆ గ్రామాల్లో 95 సంవత్సరాలుగా ఇలా ప్రతీ సంవతసరం శ్రీరామనవమి ముందు రోజు వర్షం కురుస్తుంది.

అలాగే ఈ సంవత్సరం కూడా అదే జరిగింది. దీంతో.. ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం తమ పై ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆనంద తాండవం చేస్తున్నారు.

English summary

Every year raining before one day of Sri Rama Navami