సంతృప్తి దొరక్కపోతే....

Everybody Have To Design Their Life Says Shruti Hassan

09:36 AM ON 24th February, 2016 By Mirchi Vilas

Everybody Have To Design Their Life Says Shruti Hassan

'మనం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. ఎవరో నిర్దేశిస్తే ఎలా ఎవరి జీవితాన్ని వాళ్లే డిజైన్‌ చేసుకోవాలి. ఈ విషయంలో మరొకరి ప్రమేయం ఉండనే ఉండకూడదు’ అని శ్రుతి హాసన్‌ అంటోంది. నేనూ అందరిలానే చదువుకొని ఉద్యోగం చేయాలనుకొన్నా. కానీ మనసు సినిమాలవైపు వెళ్లమంది. అదే చేశా. అందుకే నేనిప్పుడు సంతోషంగా ఉన్నా’’ అంటోన్న ఈ ముద్దుగుమ్మ, స్ఫూర్తి పేరుతో కాపీ కొట్టుకొంటూ పోతే అలాంటి జీవితానికి అర్థం లేదని చెబుతోంది. ‘‘ఎవరో ఏదో అయ్యారని మనమూ అదే అవ్వాలనుకోవడం సరికాదు. ఇంట్లో వాళ్లను సంతృప్తి పరచాలనో లేదంటే ఫలనా రంగంలో డబ్బులు బాగా సంపాదించొచ్చనో మన మనసును చంపుకోకూడదు' అని శృతి స్పష్టం చేస్తోంది. 'మీ ఇష్టాయిష్టాలేంటో మీరు తెలుసుకోండి. మీ మనసు ఏం చెబితే అది చేయండి. ఇష్టం లేని రంగంలో రూ.కోట్లు సంపాదించినా సంతృప్తి దొరక్కపోతే ఎలా ? అప్పుడు కరెన్సీ నోట్లు వుండి కూడా ఎందుకు కొరగావు. అప్పుడు ఆ నోట్లే చిత్తుకాగితాలతో సమానం అవుతాయి' అని ఈ అందచందాల శృతి లెక్చర్లు దంచేస్తోంది.

English summary

Shruti Hasaan has stardom in both Bollywood and In South Film Industry.Shruti hassan says that everybody have to design their own life of their own and no body should enter into ones life.