ఖైదీ గురించి ఎవరేమన్నారు

Everyonce opinion about Kaidi No 150

11:23 AM ON 12th January, 2017 By Mirchi Vilas

Everyonce opinion about Kaidi No 150

ఎంతోకాలంగా వేచిచూసిన చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీనెం 150 సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా పై రివ్యూలు, కామెంట్లు పెద్ద ఎత్తున కనిపిస్తుంటే, టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సినిమా మీద తమ అభిప్రాయాలన్ని ట్విట్టర్, ఫేస్ బుక్ లలో వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు చిరు ఖైదీ సినిమాపై ఏమంటున్నారో చూద్దాం.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ 'సినిమా చేసి చాలా రోజులు అయింది' అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు... జై చిరంజీవా. జగదేకవీరా' అన్నాడు.

నాగ్ విషెస్ ..

చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 గురించి హీరో నాగార్జున బెస్ట్ విషెస్ చెబుతూ ఈ మూవీ ఆల్ టైం బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్ చేసాడు.

మోహన్ బాబు కూడా ...

అంతేకాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందిస్తూ, బెస్ట్ మూవీ అని కితాబిచ్చాడు. షడ్రసోపేతమైన భోజనమన్న పరుచూరి

మెగాస్టార్ పునరాగమనంతో ప్రేక్షకులకు పంచభక్ష్య పరమాన్నాలతో షడ్రసోపేతమైన భోజనం వడ్డించిన మెగాస్టార్ కి అభినందనలు! వినాయక్ యు డిడ్ ఇట్!రాంచరణ్ కంగ్రాట్స్! అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు

ఇక జక్కన్న ఏమన్నాడంటే

ఖైదీ నెంబర్ 150 సినిమాపై జక్కన్న తన ఒపీనియన్ ని బయటపెట్టాడు. బాస్ ఈజ్ బ్యాక్.. పదేళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ వెనక్కి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే ప్రొడ్యూసర్ గా చరణ్.. రికార్డు బ్రేకింగ్ సినిమాతో కెరీర్ ప్రారంభించావని రాజమౌళి రాసుకొచ్చాడు. డైరెక్టర్ వినయ్ కుమ్మేశాడని, తను తప్పితే ఈ మెగా ప్రాజెక్టుని ఎవరూ అంతలా చేయలేరని జక్కన్న మరో ట్వీట్ లో పొగిడేశాడు.

పూల జల్లు కురిపించిన హరీష్ శంకర్ ...

మరో డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా మెగా మూవీపై పూలజల్లు కురిపించేశాడు. సినిమాల్లోకి తిరిగొచ్చిన బిగ్ బాస్ మరిన్ని హిట్లతో మరిన్ని సంవత్సరాలు ఫ్యాన్స్ ని అలరిస్తారని హరీష్ ట్వీట్ చేశాడు. ఐతే, మెగా ఫ్యామిలీపై ఎప్పటికప్పుడు సెటైర్లు వేసే కొన్ని ట్విట్టర్ ఖాతాలు మాత్రం ఇంకా మేలుకోలేదు.

ఇది కూడా చూడండి : కిడ్నీలను శుభ్రంగా ఉండాలా అయితే దివ్యౌషదం తయారుచేసుకోండి

ఇది కూడా చూడండి : ఇవి సడెన్ గా ఆపేస్తే… లావై పోతారట నిజమా?

ఇది కూడా చూడండి : ఖైదీ నెంబర్ 150 రివ్యూ అండ్ రేటింగ్

English summary

Chiraanjeevi Kaidi NO 150 movie released yesterday very grandly all over the world.Every one said their opinion in twitter,Facebook