జనవరి 30న 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందే

Everyone Should Be Silence For Two Minutes On Jan 30

12:24 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Everyone Should Be Silence For Two Minutes On Jan 30

ఈ నెల 30న ఉదయం పదకొండుగంటలకు దేశవ్యాప్తంగా రెండు నిముషాల పాటు మౌనాన్ని పాటించాలని కేంద్రహోంశాఖ సూచించింది. విధినిర్వహణలో ఉన్నా....ప్రయాణంలో ఉన్నాసరే సరిగ్గా పదకొండు గంటల సమయానికి ఆయా పనులను ఆపేసి రెండునిముషాల మౌనాన్ని పాటించి అమరవీరులకు అంజలి ఘటించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హొమ్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 30న నిర్వహించుకునే ‘అమరవీరుల దినోత్సవం’లో సాధారణ ప్రజానీకం అంతా పాల్గొనేలా చూడాలని అన్ని రాష్ట్రాలనూ కోరింది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన అత్యంత ప్రధానమైన రోజని పేర్కొంటూ, అందుకే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగసంస్థలన్నీ కూడా వారివారి పరిధుల్లో అమరవీరుల దినోత్సవాన్ని శ్రద్ధగా నిర్వహించుకోవాలని ఆదేశించింది.అదే రోజున స్వాతంత్య్ర సమరయోధుల పాత్రను ప్రత్యేకంగా స్మరించుకుంటూ ఉపన్యాసాలు, చర్చాగోష్టులు నిర్వహించుకోవాలని కూడా కేంద్ర హోంశాఖ పేర్కొంది.

ఇక అదే రోజు 1948 జనవరి 30న జాతిపిత మహాత్మాగాంధీ హత్యకు గురైన విషయాన్ని కూడా హొమ్ శాఖ ప్రస్తావిస్తూ, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శించాలని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఫీల్డ్‌ పబ్లిసిటీ విభాగాలకు సూచించింది. కేంద్ర హొమ్ శాఖ విశిష్ట ఉత్తర్వులు జారీచేయడం విశేషం.

English summary

Central Home Ministry says that everyone in India should be silence for two minutes on January 30.