భార్య బిడ్డలతో రోడ్డున పడ్డ మాజీ ఎంఎల్ఏ

Ex BSP MLA Lives In A Road Side Tent

11:25 AM ON 24th June, 2016 By Mirchi Vilas

Ex BSP MLA Lives In A Road Side Tent

ఈరోజుల్లో ఒక్కసాగారి ఎం ఎల్ ఏ కాదు, కార్పొరేటర్ చేస్తే చాలు జీవితం అంతా హాయిగా వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరైతే, తమ భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే అంటే మామూలు ప్రజాప్రతినిధి కాదు.. ప్రజలు ఎంతవరకు సేవ చేస్తారో తెలియదు కానీ స్వీయ ఎదుగుదలకు మాత్రం అడ్డుఅదుపు ఉండదనే మాట అందరి నోటా వినిపించేది. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు తరతరాలకు సరిపడా సంపాదించుకోవడమో...లేదంటే సంపాదనా మార్గాలు సృష్టించుకోవడమో చేసుకుంటున్నారు చాలామంది. అయితే, ఇందులో కూడా మంచోళ్ళు, నిజాయితీ పరులు ఉండనే వున్నారు అలాంటి నిజాయితీ పరులు నూటికో కోటికో ఒక్కరు కనిపిస్తారు. అలాంటి వాళ్ళు పదవిలో ఎంతకాలం ఉన్నా, కూడా పైసా కూడా సంపాదించుకోకుండా మిగిలిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇది. ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేక పిల్లాపాపలతో కలిసి రోడ్డు పక్కన టెంటు వేసుకుని ఉంటున్నారు. ఈయనేదో పాతకాలం ఎంఎల్ఏ కాదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే,

పంజాబ్ లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శింగరరామ్ షాహుంగ్రా తన కుటుంబంతో కలిసి రోడ్డు పక్కన వేసుకున్న టార్పాలిన్ టెంట్ లో నివసిస్తున్నాడు. రెండుసార్లు ఎన్నికైనప్పటికీ తనకంటూ ఏమీ ఆస్తి సంపాదించుకోలేదు. నిజాయితీపరుడిగా పేరొందిన షాహుంగ్రా ఇన్నాళ్లూ ప్రభుత్వ గృహంలో నివసించేవాడు. అయితే ప్రభుత్వాధికారులు ఆయనను అక్కడినుంచి ఖాళీ చేయించారు. దీంతో గత్యంతరం లేక, పంజాబ్ లోని హోషియాపూర్ జిల్లాలో రోడ్డు ప్రక్కన టార్పాలిన్ టెంట్ వేసుకుని, భార్యాబిడ్డలతో అందులోనే గడుపుతున్నాడు.

పోనీ ఈ మాజీ ఎమ్మెల్యే దయనీయ స్థితి చూసి, బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదట. బీఎస్సీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చివరి రోజుల్లో ఆయనకు అండగా ఉన్నారన్న కారణంతోనే ప్రస్తుత బీఎస్పీ నేతలు అతన్ని పక్కన పెట్టారని అంటున్నారు. అయితే.. పంజాబ్ ప్రభుత్వం ఆయన్ను అధికార నివాసం నుంచి ఖాళీ చేయించడానికి కూడా చాలా ప్రయత్నాలు చేసిందట. సొంతిల్లు లేకపోవడంతో ఆయన ప్రభుత్వ గృహాన్ని వదిలిపెట్టడానికి ఏమాత్రం అంగీకరించలేదు. దీంతో మెజిస్టీరియల్ ఆదేశాలతో పోలీసుల సహాయంతో ఖాళీ చేయించారు. దీంతో సొంతిల్లు లేని ఈ మాజీ ఎంఎల్ఏ రోడ్డున పడ్డాడు.

ఇవి కూడా చదవండి:పీవీ నరసింహారావుకు భారత రత్న ఖాయమా?

ఇవి కూడా చదవండి:ఉదయం 3 గంటలను 'డెవిల్ అవర్' అని ఎందుకంటారో తెలిస్తే భయపడతారు!

English summary

Ex-BSP MLA Named Singara Ram was elected as MLA As Two Times in Punjab State and he was very sincere MLA and recently he was thrown out out from the Government House and now he was living in a Roadside Tent because he did not have a own house.