సైకిలెక్కిన సాయిప్రతాప్

Ex Central Minister Sai Prathap Joined In TDP

05:39 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Ex Central Minister Sai Prathap Joined In TDP

పరిణామాలు ఎటు తిరిగి ఎటువస్తాయో తెలీని పరిస్థితి నడుస్తోంది తెలీన్దంటారు. ప్రస్తుతం ఎపిలో టిడిపి జోరు సాగుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీల నేతలు సైకిలు ఎక్కేస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ టిడిపి లో చేరారు. గురువారం ఉదయం తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కారు. సాయిప్రతాప్‌ యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన డాక్టర్ సాయిప్రతాప్ కడప జిల్లా రాజంపేట నుంచి ఆరు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసిన ఈయన ఆతర్వాత మళ్ళీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా ఏక్టివ్ కాలేదు. ఇప్పుడు పచ్చ కండువా కప్పుకున్నారు.

ఛీ..ఛీ..ఫ్యామిలీ అంతా దగ్గరుండి రేప్ చేయించారు

ధోని పై టాలీవుడ్‌ అభినందనల జల్లు

దేశంలో ఇప్పటికీ తేలని మిస్టరీలు

రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముతున్న మోహన్ బాబు

వర్మ కాలర్ పట్టుకున్న నిర్మాత

English summary

Ex Union Minister of India Sai Prathap Joined in Telugu Desam Party. Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu Welcomed Sai Prathap into the party.He was elected for Lok Sabha for Six times from Rajam Peta constituency.