కరుణాకర్ అరెస్టు కు రంగం సిద్ధమా !!

Ex MLA Karunakar Reddy To Be Arrested

10:34 AM ON 9th March, 2016 By Mirchi Vilas

Ex MLA Karunakar Reddy To Be Arrested

ఓపక్క కాపుల సమస్య పై మార్చి 10లోగా లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వకపోతే, 11నుంచి ఆమరణ దీక్షకు రెడీ అని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంటుంటే, మరోపక్క తూర్పుగోదావరి జిల్లా తునిలో నెల కిందట జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమ సభ సందర్భంగా చోటు చేసుకున్న విధ్వంసానికి సంబంధించి తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ముఖ్యనేత భూమన కరుణాకర్‌రెడ్డి ని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు జోరుగా ఉహాగానాలు చెలరేగుతున్నాయి. జనవరి 31నాటి కాపు ఉద్యమ సభ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు హింసాత్మక చర్యలకు పాల్పడి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పంటించారు. పోలీస్ స్టేషన్‌ని కూడా చుట్టుముట్టారు. నాటి హింసాకాండలో వందలాదిమంది గాయపడ్డారు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన నాటి సభా కార్యక్రమం నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి ఆయనతో పలుమార్లు టచ్‌లోకి వచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు.

ముద్రగడను కరుణాకర్ కలుసుకున్నట్లు పోలీసులు ధృవీకరించుకుని, తుని విధ్వంసం వెనుక వైసీపీ నేతల హస్తమున్నట్లు సీఐడీ ఒక నిర్ధారణకు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కరుణాకర్ రెడ్డికి నేడో, రేపో సీఐడీ నోటీసులిచ్చి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. తన ఉద్యమం వెనుక ఎవరూ లేరని , అన్నింటికీ తానే బాధ్యత వహిస్తున్నానని, ఆ ఘటనలకు తననే భాధ్యునిగా చేసి, అరెస్టు చేయాలని , బెయిల్ కూడా పెట్టుకోనని ఓ పక్క ముద్రగడ స్పష్టం చేసినా, జగన్ శిబిరాన్నే టిడిపి టార్గెట్ చేసుకుంది. ఘటన జరిగిన నాడు ఇదంతా వైసిపి పనేనని చెప్పిన టిడిపి, జగన్ చేతిలో ముద్రగడ పావుగా మారినట్లు ఇప్పుడు కూడా విమర్శలు గుప్పిస్తూనే వుంది.

English summary

Ex-MLA , TTD Ex-Chairman ,Ysrcp Party leader Bhumnana Karunakar Reddy to arrest by the CID on Kapu protest in Andhra Pradesh.Kapu Leader Mudragada Padmanabham was said that he was the reason behind for Kapu protest in Tuni.