బిజెపికి  యెన్నం శ్రీనివాసరెడ్డి గుడ్ బై 

Ex-MLA Srinivasa Reddy Resigns To BJP

12:46 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Ex-MLA Srinivasa Reddy Resigns To BJP

బీజేపీకి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా బిజెపికి దూరంగా ఉంటున్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత కిషనరెడ్డికి పంపించారు. తనకు ఏ పార్టీలోనూ చేరే ఉద్ధేశం లేదని, 2016లో ప్రత్యేక ప్రాంతీయపార్టీని ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. తెలంగాణ లక్ష్యాలు, గమ్యాలు మారిపోతున్నాయని, ఇప్పుడు మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బడుగుల తెలంగాణ కోసం తాము కృషి చేస్తామని యెన్నం ప్రకటించారు. తెలంగాణా సాధనకోసం కృషి చేసిన మరీ ముఖ్యంగా ఉద్యమించిన వారి పరిస్థతి దయనీయంగా వుందని , ఇంకా కేసులను ఎదుర్కొంటూ , ఇబ్బంది పడుతున్నారని ఆయన వాపోయారు.

English summary

Telangana BJP Leader Ex-MLA Srinivasa Reddy Resigned To BJP. He sends his Resign Letter To BJP Leader Kishan Reddy.He Said That he is going to start a new party in 2016 and fight against TRS party on behalf of People.