ఆనంద గజపతి రాజు కన్నుమూత

Ex MP Ananda Gajapathi Raju was expired today

04:39 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Ex MP Ananda Gajapathi Raju was expired today

విజయనగరం మహారాజా వంశానికి చెందిన మాజీ ఎంపీ పూసపాటి ఆనంద గజపతిరాజు కన్నుమూశారు. విశాఖలోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సోదరుడైన ఆనంద గజపతిరాజు ప్రస్తుతం మాన్సాస్‌ సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు. రెండు సార్లు రాష్ట్రమంత్రిగా, రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. సింహాచలం, రామతీర్థం, అరసవల్లి, శ్రీకూర్మం దేవస్థానాలకు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరించారు.

భర్త పై కోపంతో వేడి నూనె పోసి నరకం చూపించింది

మగాడిగా నటించి అమ్మాయిలతో సెక్స్ చేసింది

మందేసి చిందేసి పోలీసులకు దొరికిపోయిన నవదీప్

1/4 Pages

ఎన్టీఆర్ పిలుపుతో.... 


1983లో ఎన్టీఆర్‌ పిలుపుతో ఆనంద గజపతిరాజు రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో విద్యాశాఖ, ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. బొబ్బిలి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆనంద గజపతి పేదల కోసం మాన్సాస్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, ట్రస్ట్‌ తరపున మహారాజ ఇంజినీరింగ్‌, డిగ్రీ, జూనియర్‌ కళాశాలలను నడుపుతున్నారు.

English summary

Ex MP Ananda Gajapathi Raju was expired today. Ex Minister and Ex MP Ananda Gajapathi Raju was expired today afternoon.