వినాయక చవితి ఉత్సవాల్లో మీరు చేస్తున్న క్షమించరాని తప్పులు

Excuseless mistakes that you was doing in Vinayaka Chavithi festival

02:34 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Excuseless mistakes that you was doing in Vinayaka Chavithi festival

గణనాధుడు, విఘ్నాధిపతి, ప్రమథ గణాధిపతి, గణపతి.. ఇలా ఎన్నో పేర్లు వినాయకుడికి వున్నాయి. విద్యారంభ సమయంలో వచ్చే వినాయకచవితి నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక పూజ చేస్తాం. ఇంకా వీధి వీధినా, సందు సందునా కూడా వినాయక చవితి పందిళ్లు వేసి ఉత్సవాలు చేస్తారు. గణపతి నవరాత్రి వేడుకలు వైభవంగా జరుపుతారు. అయితే వినాయక చవితి పండగలో తెలిసి తెలిసి కొన్ని క్షమించరాని, సహించరాని తప్పులు చేస్తున్నాం. ప్రతీ వినాయక చవితికి ఇదే తంతు జరుగుతుంది. ఏంటంటే అసలు వినాయకుణ్ణి మనం మండపాలల్లో ఎందుకు ప్రతిష్టిస్తున్నాము? అందులో అంతరార్థం ఏంటి? ఈ విషయంలో చాలా మంది తప్పుదోవ పడుతున్నారు.

1/5 Pages

వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందండి. వినాయక సహస్ర నామాలలో వెయ్యి రకాలు చెప్పబడాయి. అలాంటి వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారుచేయించుకుని ఇలా ఎందుకు పూజిస్తున్నారు. ఈగ గణపతి, గబ్బర్ సింగ్ గణపతి, బాహుబలి గణపతి, స్పైడర్ మాన్ గణపతి, బుల్లెట్ గణపతి... ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. ఎందుకు ఇంతటి దుర్మార్గపు కృత్యాలు..? చేస్తున్నారు అని చాలామంది పెద్దవాళ్ళు ఆవేదన చెందుతున్నారు.

English summary

Excuseless mistakes that you was doing in Vinayaka Chavithi festival