వర్కవుట్ చేయకుంటే బ్రెయిన్ తగ్గుతుందట..

Exercise In Middle Age stops your brain shrinking

10:12 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Exercise In Middle Age stops your brain shrinking

ఉదయం లేచింది మొదలు పని పని అని పరుగులు పెడుతున్నారా.. వ్యాయామం చేయడానికి కొంచెంద సమయం కూడా కేటాయించలేకపోతున్నారా.. అని మీ మెదడు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అవునండీ.. మెదడుకు.. శారీరక దారుఢ్యానికి లింక్ ఉందని పరిశోధకులు చెపుతున్నారు. మిడిల్ ఏజ్ లో శారీరక దారుఢ్యం సక్రమంగా ఉండకపోవడానికి.. 20 ఏళ్ల తర్వాత మెదడు పరిమాణం చిన్నగా మారడానికి సంబంధం ఉందని బోస్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల పరిశీలనలో తేలింది. వీరు సగటున 40 ఏళ్ల వయసున్న 1,583 మందిపై ట్రెడ్‌మిల్‌ పరీక్ష నిర్వహించారు. ఒకట్రెండు దశాబ్దాల అనంతరం ఎంఆర్‌ఐలతో మెదడు స్కానింగ్‌ చేశారు. శారీరక వ్యాయామం చేయడం తగ్గినకొద్దీ మెదడు పరిమాణం తగ్గుతుందని వివిధ రకాల పరిశీలనల ద్వారా గుర్తించినట్లు బోస్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. శారీరక సామర్థ్యం సరిగా లేకపోవడానికీ, దశాబ్దాల తర్వాత మెదడు పరిమాణానికి నేరుగా సంబంధం ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. మెదడు పరిమాణం తగ్గడం వృద్ధాప్యం వేగానికి సంకేతంగా నిలుస్తుందని వీరు చెపుతున్నారు.

English summary

According a new study tha found that exercising in your 40s could stop the brain shrinking.A study found people with good fitness levels in their 40s had larger brains.