తమిళనాడులో ఎన్నికల  సర్వే లేమంటున్నాయ్

Exit Poll Surveys On Tamilnadu Elections

03:50 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Exit Poll Surveys On Tamilnadu Elections

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల తంతు తారాస్థాయికి చేరింది. దీంతో సర్వేల హోరు పెరిగింది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల సందర్భంగా నిర్వహించే సర్వేలు అన్నీ ఒకేలాంటి ఫలితాల్ని కాస్త అటూ ఇటూగా చెప్పేస్తుంటాయని అంటారు. అయితే అందుకు భిన్నమైన పరిస్థితి తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కూడా అమ్మకు ఎదురులేదని. ఈసారి రికార్డు స్థాయిలో అమ్మ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవటం ఖాయమన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తుంటే, అందుకు అనుగుణంగా అన్ని సర్వేలు ఘోషించాయ్. కానీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రక్రియ షురూ అయిన నాటి నుంచి రాజకీయం నెమ్మదిగా మారుతోంది. అందుకు తగ్గట్లే సర్వే సంస్థల ఫలితాల అంకెల్లోనూ మార్పు చోటు చేసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి:రూమ్ కి అమ్మాయిలని పంపిస్తే బ్యాంకు లోన్ ఇచ్చేస్తాడట

ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు రోజుల్లోకి వచ్చేసిన తాజా పరిస్థితుల్లో ఏ పార్టీ కూటమి అధికారాన్నిసొంతం చేసుకుంటుందన్ని ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజింగ్ మారింది. ఎన్నికల ప్రక్రియ మొదలు కావటానికి ముందు నుంచి ఇప్పటివరకూ పలు మీడియా సంస్థలు వివిధ సందర్భాల్లో చేసిన సర్వేల్ని క్రోడికరించి సింఫుల్ గా విషయాన్ని చెప్పేస్తే. తమిళనాడు ఎన్నికల మీద ప్రముఖ సర్వే సంస్థలు ఐదు సర్వేలు నిర్వహిస్తే మూడు సంస్థల అధికారపక్షమైన జయలలిత అధికారాన్ని చేజిక్కించుకోవటం ఖాయమని చెప్పగా, మరో రెండు సంస్థలు మాత్రం విపక్ష డీఎంకే కు పవర్ పక్కా అని ప్రకటించాయ్.

ఇవి కూడా చదవండి:అందరి ముందు హీరోయిన్ బట్టలు విప్పించిన డైరెక్టర్

ఇలా ప్రముఖ సంస్థ విరుద్దమైన సర్వే ఫలితాల్నిప్రకటించంతో అధికారం ఎవరికి సొంతం కానుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదట్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించట్లదన్న మాట వినిపించిన డీఎంకే ప్రచారం జోరుగా చేస్తుంటే.. అధికారపక్షమైన జయలలిత వర్గం ప్రచారంలో వెనుకబడిపోయినట్లు వార్తలు గుప్పు మంటున్నాయి. ఐదు సంస్థలు వెలువరించిన సర్వే ఫలితాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, అధికార అన్నాడీఎంకే కు అలాగే విపక్ష డీఎంకే పక్షానికి కానీ గెలుపు అంత సులువు కాదని.. ఇరు వర్గాల మధ్య టగ్ ఆఫ్ వార్ అని తెలుస్తోంది. ఒకసారి పవర్ ఇచ్చిన పార్టీకి రెండోసారి పవర్ ఇచ్చే అలవాటు లేని తమిళ ప్రజలు ‘అమ్మ’కు ఆ అవకాశం ఇస్తారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. అదే కనుక జరిగితే ఓ రికార్డు అవుతుంది. లేదంటే సంప్రదాయంగా ఓసారి ఓ పార్టీకి, మరోసారి ఇంకో పార్టీకి అనే లెక్కల్లో వెడితే సీన్ రివర్స్ అవుతుంది. ఐదు సర్వే సంస్థలు చెప్పే ఫలితాలు ఓసారి పరిశీలిద్దాం.


మీడియా సంస్థ అన్నా డీఎంకే డీఎంకే ఇతరులు

టైమ్స్ నౌ : 130 70 34

ఇండియా టీవీ : 116 101 17

న్యూస్ 7.. దినమలర్ : 52 108 74

పుదియతలైమురై : 164 56 14

గుడ్ విల్ కమ్యూనికేషన్ : 90 139 5

English summary

Tamilnadu Elections were getting heat day by day and now Exit poll results of various channels were getting tense on Political Parties in Tamilnadu.