మార్పుని సూచిస్తున్న ఎగ్జిట్ పోల్స్

Exit Polls Survey Results Of 5 States Elections

11:40 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Exit Polls Survey Results Of 5 States Elections

తమిళనాడు, పశ్చిమ్‌బంగ, కేరళ, అసోం రాష్ట్రాల అసెంబ్లీలకు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి జరిగిన ఎన్నికలపై పలు సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పిడి అనివార్యంగా చెబుతున్నాయి. తమిళనాడులో డిఎంకె అధికారం లోకి రాబోతోందని సర్వేలు చెబుతున్నాయి. అయితే పశ్చిమ బుంగ లో మమతకే మళ్ళీ పట్టం కడతారని సర్వేలు తేల్చాయి. ఈశాన్య భారతంలో పెద్దరాష్ట్రమైన అసోంలో తొలిసారిగా బిజెపి కూటమి అధికారం చేపట్టనుందని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నాయి. పశ్చిమ్‌బంగలో అధికారంలో వున్న తృణమూల్‌ కాంగ్రెస్‌కే తిరిగి ఓటర్లు పట్టం కట్టినట్టు తెలిసింది. కేరళలో వామపక్షకూటమి, తమిళనాడులో డీఎంకేవైపు ఓటర్లు మొగ్గు చూపినట్టు పోల్స్‌ విశ్లేషించాయి

అసోం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజేబిదే విజయమని ఇండియాటుడే- యాక్సిస్‌ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్‌ వెల్లడించింది.మొత్తం 126 స్థానాల్లో భాజపా కూటమికి 79 నుంచి 93 స్థానాలు దక్కవచ్చని తెలిపింది. కాంగ్రెస్‌ 26 నుంచి 33 సీట్లకు పరిమితం కానుండగా ఏఐడీయూడీఎఫ్‌ 6 నుంచి 10 స్థానాలను గెలుచుకునే అవకాశముంది.

 

1/5 Pages

పశ్చిమ్‌బంగలో మమతకే తిరిగి అధికారం ....

అయితే పశ్చిమ్‌బంగ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో వున్న మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారాన్ని తిరిగి కైవశం చేసుకుంటుందని ఏబీపీ ఆనంద ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించింది. మొత్తం సీట్లలో తృణమూల్‌ 178, లెఫ్ట్‌-కాంగ్రెస్‌ కూటమి 110, భాజపాకు 1, ఇతరులకు 5 సీట్లు దక్కవచ్చని పేర్కొంది.

English summary

Exit Polls results says that Karuna nidi party DMK will win in Tamilnadu elections, CPM will win win in Kerala ,Trunamul Congress Will win again in West Bengal and DMK in Pondicherry Elections.