డిసెంబర్‌ 19న 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' పాటలు!

Express Raja audio on December 19th

01:24 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Express Raja audio on December 19th

రన్‌ రాజా రన్‌, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్‌ హీరో శర్వానంద్‌ హ్యాట్రిక్‌ విజయానికి సిద్ధమయ్యాడు. రన్ రాజా రన్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన యువి క్రియేషన్స్‌ పతాకం పై నిర్మిస్తున్న తాజా చిత్రం ''ఎక్స్‌ప్రెస్‌ రాజా'. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఫేమ్‌ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్‌ సనసన సురభీ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలని డిసెంబర్‌ 19న అంగరంగ వైభవంగా విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రానున్నారు.

ఎక్స్‌ప్రెస్‌ రాజా నిర్మాతలైన వంశీ, ప్రమోద్‌ మాట్లాడుతూ మా సంస్ధలో శర్వానంద్‌ చేసిన రన్‌రాజారన్‌ ఎంత హిట్‌ అయిందో మీ అందరికీ తెలిసందే. మళ్లీ మా సంస్థ నుండి వస్తున్న ఎక్‌ప్రెస్‌ రాజా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నాము. ఈ చిత్రంలోని ఒక పాటని ఏ రోజు విడుదల చేస్తున్నాము. మిగతా పాటల్ని డిసెంబర్‌ 19 న విడుదల చేయబోతున్నాము అని నిర్మాతలు చెప్పారు. జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

English summary

Sarwanand's Express Raja audio releasing on December 19th. Young Rebal Star Prabhas is chief guest for this audio launch.