మీ చర్మానికి సరిపడే ఫేస్ ప్యాక్స్

Face packs for all skin types

01:41 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Face packs for all skin types

ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన,అందమైన, ప్రకాశించే మరియు దోషరహిత చర్మం కావాలని కోరుకుంటారు. కానీ సరైన ఆహారం తీసుకోకపోవటం, అనారోగ్య ఆహార ఎంపికలు, చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోవటం, పర్యావరణ కాలుష్యం, సూర్య కిరణాలు, మొటిమలు,ఫిగ్మేంటేషన్ వంటి కారణాల వలన చర్మం నిస్తేజంగా మారుతుంది. అయినప్పటికీ, చర్మం ప్రకాశవంతంగా మారటానికి మార్కెట్ లో అనేక రకాల క్రీమ్స్, జెల్లీలు,లోషన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ క్రీమ్స్ లో బ్లీచ్, రసాయనాలు మరియు విషాలు ఉండుట వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యకరమైన ప్రకాశించే చర్మం కోసం సహజమైన ఫేస్ పాక్స్ మీద దృష్టి పెడితే మంచిది. చర్మాలలో పొడి చర్మం, జిడ్డు చర్మం, సాదారణ చర్మం,కాంబినేషన్ చర్మం వంటి వివిధ రకాలు ఉన్నాయి. ఈ వ్యాసంలో మొటిమలు,జిడ్డు చర్మం,పొడి చర్మం కోసం కొన్ని ఫేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.

* ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే మంచి పలితాలు వస్తాయి.
* ముఖాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఫేస్ ప్యాక్ వేయాలి.
* ముఖానికి వేసే ఫేస్ ప్యాక్ పై పొర తేమగా ఉండేలా చూసుకోవాలి.
* ప్యాక్ న కళ్ళ చుట్టూ,పెదాలకు రాయకూడదు.
* జిడ్డు చర్మం,పొడి చర్మం ఉన్నవారు ప్యాక్ ని 10 నిమిషాల్లో తీసేయాలి.

అన్ని రకాల చర్మాలకు 11 సహజమైన ఫేస్ మస్క్స్

ఈ ఫేస్ ప్యాక్స్  సహజమైన పదార్దాలను ఉపయోగించటం వలన చాలా సురక్షితంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్యాక్స్ లో ఉపయోగించే పదార్దాల కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అలాగే ఈ పదార్దాలను మా అముమ్మ కాలం నుండి ఉపయోగిస్తున్నారు.

1/11 Pages

1. క్యారెట్ మాస్క్

సాదారణంగా మనకు క్యారెట్ రసం బరువు తగ్గటానికి సహాయపడుతుందని తెలుసు. కానీ ఇది చర్మ సంరక్షణలో కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. క్యారట్ లో బీటా కెరోటిన్, విటమిన్ సి మరియు K సమృద్దిగా ఉండుట వలన  ఆరోగ్యకరమైన చర్మం కోసం సహాయపడతాయి. ఇది జిడ్డు చర్మం వారి కోసం  ఖచ్చితమైన సహజమైన ఫేస్
ప్యాక్  చెప్పవచ్చు. తేనెలో  సహజమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన మొటిమలను నివారించటానికి, మృదువుగా చేయటానికి ,తేమగా ఉంచటానికి మరియు చర్మ శరీర చాయ మెరుగుపరచటానికి సహాయపడుతుంది. క్యారట్ లో విటమిన్ ఎ తగినంత మోతాదులో ఉండుట వలన ముడతలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది.

కావలసినవి

  • క్యారట్ - 2 లేదా 3
  • తేనే – అరస్పూన్

పద్దతి

  • క్యారట్ రసంలో ఒక స్పూన్ తేనే వేసి బాగా కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

In this article, we have listed the best natural face packs for acne, pimples, oily skin and dry skin. Follow these steps then you get gorgeous fair skin