ఫేస్‌ మార్పిడి అయిందోచ్‌

Face Was Changed

01:49 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Face Was Changed

ఫేస్‌ టర్నింగ్‌ కాదు... మార్పిడి వచ్చేసింది... కాళ్ళు, చేతులు వంటి కృత్రిమ అవయవాలు అమర్చడానికి జైపూర్‌ వంటి ప్రాంతాలున్నాయని, అలాగే కిడ్నీన, గుండె, కాలేయ మార్పిళ్లు చేసే హాస్పిటల్స్‌ కూడా చాలా వున్నాయి. ఇప్పుడు సరికొత్తగా 'ముఖ మార్పిడి' అదేనండి ఫేస్‌ ఛేంజ్‌ కూడా సాధ్యమేనని అమెరికా నిపుణులు అంటున్నారు. అనడమే కాదు చేసి చూపించారు. వివరాల్లోకి వెళితే,.... అగ్ని కీలల్లో రూపు లేకుండా పోయిన పాట్రిక్‌ హార్డిసన్‌ (41) అనే వ్యక్తికి... ముఖ మార్పిడి చేసి కొత్త రూపునిచ్చారు. 100 మంది 26 గంటలు శ్రమించి ఈ ఆపరేషన్‌ చేశారు. న్యూయార్క్‌లోని లాంగోస్‌ మెడికల్‌ సెంటర్‌ దీనిని నిర్వహించింది. ప్రమాదంలో అతడి చెవులు, ముక్కు, జుట్టు, కనుబొమ్మలు, పెదవులతో సహా ముఖమంతతా ఛిద్రమై పోయింది. ఇప్పుడు కొత్త రూపుతో సరికొత్తగా జీవితాన్ని ప్రారంభించనున్నాడు. గతంలో అతడికి దాదాపు 70 శస్త్రచికిత్సలు జరిగాయి. ఫలితతసదం లేకపోవడంతో ముఖాన్నే మార్చేశారు.

English summary

Face Was Changed