చెన్నై విలయంపై ఫేస్‌బుక్‌ అలర్ట్‌

Facebook alert activated behalf of Chennai floods

12:41 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Facebook alert activated behalf of Chennai floods

ప్రకృతి విలయాలకు, మానవ ప్రమేయంతో జరిగే ఉగ్రవాద దాడులకు ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టిన సెక్యూరిటీ చెక్‌ను ఇప్పుడు ఫేస్‌బుక్‌ చెన్నై వరదలకు కూడా విడుదల చేసింది. ఈ ఫేస్‌బుక్‌ ఫీచర్‌ ద్వారా ప్రతీఒక్కరూ తాము సురక్షితంగా ఉన్నామని తమ సంబంధీకులకు తెలియజేసేందుకు వీలుంటుంది. పారిస్‌ ఉగ్రవాదుల దాడులు, నేపాల్‌ భూకంపం సందర్భంగా కూడా ఇలాంటి అలర్ట్‌ను విడుదల చేసిన ఫేస్‌బుక్‌ సంస్థ ఇక నుండి ప్రతీ ప్రకృతి విలయాలకు, మానవ ప్రమేయం ఉన్న దుర్ఘటనలకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది.

గత వంద సంవత్సరాలలో చూడలేని స్థాయిలో చైన్నై నగరం ఇప్పుడు వరద ముప్పును చవిచూస్తోంది. మానవ జీవనం సమస్తం స్తంభించిపోయింది. ఐటి రంగంలో అభివృద్ధిని చూస్తున్న చెన్నై నగరం ఇప్పుడు ఇలా విలయంలో చిక్కుకోవడంతో చెన్నైలో ఉన్న తమ బంధువులు ఎలా ఉన్నారోనన్న ఆందోళనలో పక్కరాష్ట్రాల వారు ఉన్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా తమ వారి పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ ఫేస్‌బుక్‌ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

English summary

Facebook has activated its Safety Check tool for Chennai floods . Facebook has activated the Safety Check tool to know about our family and friends to say they were safe