ఆఫ్ లైన్ లో ఉన్నా సరే..

Facebook allows to post comments even when offline

05:26 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Facebook allows to post comments even when offline

ఆఫ్ లైన్ లో ఉన్నా సరే ఇకపై ఫేస్ బుక్ లో మీ కామెంట్లను పోస్ట్ చయవచ్చు. ఇందు కోసం న్యూస్ ఫీఢ్ పనిచేసే విధానానికి కొన్ని మార్పులు చేస్తున్నట్టు ఫేస్ బుక్ గురువారం ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించి టెస్టింగ్ కూడా ప్రారంభించినట్టు వెల్లడించింది. ఆఫ్ లైన్ లో లేదా స్లో నెట్ వర్క్ కనెక్షన్ లో ఉండే వారి కోసం ఈ సదుపాయం తీసుకొచ్చింది. అలాగే ఆఫ్ లైన్ లో లేదా స్లో నెట్ వర్క్ కనెక్షన్ ఉన్న వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యూస్ ఫీడ్ ను చూసేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు, టన్నెల్స్, సబ్ వేలు మొదలైన ప్రాంతాల్లో నెట్ వర్క్ సిగ్నల్ తక్కువగా ఉంటుందని అటువంటి వారికోసం ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్టు పేర్కొంది. ఈ మార్పుల వల్ల యూజర్లు తమ కామెంట్లను పోస్ట్ చేయగానే వాటిని రిసీవ్ చేసుకుని.. ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రాగానే వాటిని పోస్ట్ చేస్తుందని తెలిపింది. ఈ మార్పులకు సంబంధించి వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ను సేకరిస్తున్న ఫేస్ బుక్ వాటి ఆధారంగా తుది మార్పులు చేయనుంది.

English summary

Facebook announced that it is testing to add new functionality that will allows the user to comment on a post when the user were offline