ఫేస్ బుక్, గూగుల్ కుమ్మక్కై చేస్తున్న భారీ ప్లాన్!

Facebook and Google were doing big project

04:05 PM ON 15th October, 2016 By Mirchi Vilas

Facebook and Google were doing big project

ప్రపంచాన్ని ఇంటర్నెట్ తో అనుసంధానించే కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ దిగ్గజాలు గూగుల్, ఫేస్ బుక్ సంస్థలు మరో ప్లాన్ చేస్తున్నాయి. సెకనుకు 15వేల జీబీల సమాచారాన్ని ట్రాన్సఫర్ చేయగల అత్యంత శక్తిమంతమైన కేబుల్ తో ఆసియాను, అమెరికాలను సముద్ర అంతర్భాగం ద్వారా కలపడానికి ప్లాన్ చేస్తున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం నుండి ప్రారంభమయ్యే ఈ కేబుల్ హాంకాంగ్ ను అనుసంధానిస్తుంది. సాంకేతిక భాషలో చెప్పాలంటే 120 టెరాబైట్స్ పర్ సెకండ్ వేగంతో ఈ కేబుల్ డేటాను బదిలీ చేస్తుంది. రెండు ఖండాలకు అటో దిక్కున ఇటో దిక్కున గల హాంకాంగుకు, లాస్ ఏంజెల్స్ నగరాలకు మధ్య దూరం అక్షరాల 12800 కిలోమీటర్లు.

ఇంటర్నెట్ చరిత్రలో ఈ ప్రాజెక్ట్ అతిపెద్ద విప్లవంగా చెప్పవచ్చు. పసిఫిక్ మహాసముద్రం అంతర్భాగం నుండి వేయనున్న ఈ ఇంటర్నెట్ కేబుల్ ప్రాజెక్టులో గూగుల్, ఫేస్ బుక్ తో పాటు పసిఫిక్ డేటా కమ్యూనికేషన్, టీఈ సబ్ కామ్ తదితర నాలుగు సంస్థలు పాలుపంచుకోనున్నాయి. వచ్చే రెండేళ్లలోగా ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయాలని ఈ సంస్థలు కంకణం కట్టుకున్నాయి.

English summary

Facebook and Google were doing big project