టర్కీ లో  ఫేస్‌బుక్‌, ట్విటర్ల పై నిషేధం

Facebook And Twitter Blocked in Turkey

03:30 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Facebook And Twitter Blocked in Turkey

టర్కీ రాజధాని అంకారాలో ఆదివారం రాత్రి ఉగ్రవాదులు రెచ్చిపోయి సాగించిన దాడుల అనంతరం ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్‌, ట్విటర్లలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఎలెర్ట్ అయిన ప్రభుత్వం ఎఫ్ బి , ట్విటర్ల పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ఫొటోల వల్ల ఫేస్‌బుక్‌, ట్విటర్లను ఉపయోగించడం ఇబ్బందిగా మారిందని చాలా మంది యూజర్లు చెప్పడంతో వాటిని నిషేధించామని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.అంకారాలో గత రాత్రి ఉగ్రవాదులు వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 34 మంది మృతి చెందగా.. అధికసంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ ఘటనల ఫోటోలు సోషల్ మీడియాకు ఎక్కించడంతో ప్రభుత్వం నిషేధ నిర్ణయం గైకొంది.

English summary

Turkish Government ban Facebook, Twitter after blast images spread on social media.Facebook, Twitter, and a number of other social networking sites has been blocked because images of the blast were going viral in the country.