ఫేస్ బుక్ లో వార్ ఫోటోపై వార్!

Facebook blocks Iconic Vietnam war photos

06:33 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Facebook blocks Iconic Vietnam war photos

ఇది రూల్ మేటర్.. చాలా సున్నితమైన అంశం కూడా. ఇంతకీ విషయం ఏమంటే, ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ కు మంచిగా మసులుకో అంటూ హెచ్చరించారు చీఫ్ ఎడిటర్.. నిజమా? అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు కథేంటి? ఆ ఎడిటర్ ఎవరు? అంటే.. నార్వేలో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఓ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో ఆ లెటర్ ను పబ్లిష్ చేశారు. ఇంతకీ ఆ ఎడిటర్ కు జుకర్ బర్గ్ మీద అంతకోపం రావడానికి వెనుక ఓ కారణముంది. వియత్నాం వార్ సమయంలో పాపాం దాడిలో ప్రాణాలు కాపాడుకునేందుకు భయంతో పరిగెత్తుతున్న ఒక చిన్నారి ఫోటోను తీసి వియత్నాం ఫోటోగ్రాఫర్ దానిని అసోసియేటెడ్ ప్రెస్ కు పంపాడు.

అప్పట్లో ఈ ఫోటోకు పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చింది. అదే ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే, నగ్నంగావున్న చిన్నారి ఫోటోని పోస్ట్ చేయడం తమ సంస్థ నియమ నిబంధనలకి విరుద్ధం అంటూ టామ్ పేజీని ఫేస్ బుక్ సంస్థ సస్పెండ్ చేసింది. పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న ఈ పిక్ పై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం చెందిన ఆఫ్టెన్ పోస్టెన్ చీఫ్ ఎడిటర్ హాన్సెన్ అదే వార్తని ప్రముఖంగా ప్రస్తావిస్తూ తన పత్రికలో ఓ వార్తని ప్రచురించారు. ఆ వార్తలోనూ చిన్నారి నగ్నంగా వున్న ఫోటోని ప్రచురించారు. అనంతరం ఆ వార్తా కథనాన్ని యథావిథిగా పత్రికకి చెందిన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసుకున్నారు.

దీంతో ఆ వార్తా కథనంలో నగ్నంగావున్న చిన్నారి ఫోటోని గుర్తించిన ఫేస్ బుక్ సంస్థ, తక్షణం ఆ ఫోటోని ఫేస్ బుక్ పేజీ నుంచి తొలగించాలనీ, లేదంటే ఎడిట్ చేయాలని సూచిస్తూ సదరు పత్రికకి ఓ నోటీసు ఇచ్చింది. అయితే, ఆ నోటీసుకి ఎడిటర్ స్పందించేలోపే ఫేస్ బుక్ సంస్థ ఆ ఫోటోతోపాటు వార్తా కథనాన్ని సైతం డిలిట్ చేసింది. దీంతో ఎడిటర్ కు కోపం వచ్చింది. చిన్నారులని అశ్లీలంగా చూపించడానికి, ఫేమస్ వార్ ఫోటోగ్రాఫ్స్ కి మధ్య వున్న తేడాలు తెలుసుకునేంత నాలెడ్జ్ ఫేస్ బుక్ కు లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. అయినా సోషల్ మీడియా సంస్థలు ప్రజలకి తమ మనోభావాలు, అభిప్రాయాలు తెలియజెప్పుకునే వేదికగా నిలవాలికానీ నారో మైండ్ తో వ్యవహరించకూడదు అంటూ ఘాటుగా ఓ కథనాన్ని ఎడిటర్ పబ్లిష్ చేశారు.

ఇది కూడా చదవండి:గుమ్మానికి మామిడి తోరణం కట్టడం వెనుక అసలు రహస్యం

ఇది కూడా చదవండి:అక్కడ వినాయకుడికి నైవేద్యంగా పెట్టేవి ఏంటో తెలిస్తే షాకవుతారు

ఇది కూడా చదవండి:గేర్లు వేయక్కరలేదు ... ఆటోమేటిక్ కార్లకు డిమాండ్

English summary

Facebook blocks Iconic Vietnam war photos