ఫేస్ బుక్ ప్రియులకు ఇక పండగే

Facebook Brings New Group Video Chat Feature In Its New Update

10:36 AM ON 21st December, 2016 By Mirchi Vilas

Facebook Brings New Group Video Chat Feature In Its New Update

సోషల్ మీడియాలో దూసుకుపోతూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అందిస్తున్న ఫేస్ బుక్ తాజాగా మరో సౌకర్యం అందించింది. ఇది నిజంగా ఫేస్ బుక్ ప్రియులకు పండగే అంటున్నారు. ఇంతకీ ఏమిటంటే, ఫేస్ బుక్ మెసేంజర్ లో సరికొత్తగా గ్రూప్ వీడియో చాట్ ఫీచర్ ను సంస్థ జోడించింది. దీనివలన ఇక కుటుంబం నుంచి దూరంగా ఉన్నామన్న బాధలేకుండా కుటుంబంతో కలిసి ఎంచక్కా చాట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐవోస్ ఫోన్లతోపాటు డెస్క్ టాప్ వెర్షన్ పైనా తక్షణం ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ఫేస్ బుక్ ప్రకటించింది.

‘‘ప్రతినెల 24.5 కోట్ల మంది మెసెంజర్ ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరినీ మెసెంజర్ లోకి తీసుకొస్తున్నాం. ఎక్కడ ఉన్నామన్న దానితో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ ముఖాముఖి మాట్లాడుకోవచ్చు’’ అని ఫేస్ బుక్ పేర్కొంది. సరికొత్త వీడియో గ్రూప్ చాట్ లో ఒకేసారి ఆరుగురు వ్యక్తులను చూడవచ్చు. అంతేకాదు మరో 50 మంది వరకు గ్రూప్ లో జాయిన్ అయి సంభాషణ వినవచ్చు. వీడియో గ్రూప్ చాట్ యాప్ ను పొందేందుకు లేటెస్ట్ వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక ఎందుకు ఆలస్యం వెంటనే వినియోగించుకోండి.

ఇవి కూడా చదవండి: పేస్ బుక్ లో చర్చ జరిగిన టాప్ పది అంశాలివే

ఇవి కూడా చదవండి: వాట్సాప్ లో కొత్తగా రెండు ఫీచర్స్!

English summary

Facebook has brought a new updates to its Messenger App that allows group video call. With this feature brought by Facebook we can make group call up to 50 members at once.