భారత్‌లో ఫేస్ బుక్ ఫ్రీబేసిక్స్‌రద్దు

Facebook Cancelled Free Basics In India

10:24 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Facebook Cancelled Free Basics In India

భారత్‌లో ఫ్రీబేసిక్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. వివిధ రకాల డేటా ఛార్జీలు ఉండడానికి వీల్లేదన్న ట్రాయ్‌ ఆదేశం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ట్రాయ్‌ నెట్ న్యూట్రాలిటీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. డేటా ఛార్జీలు ఒకేలాగా ఉండాలని, వివిధ రకాల డేటా ఛార్జీలు వసూలు చేస్తే రోజుకు రూ.50 వేల జరిమానా విధిస్తామని తెలిపింది. దీంతో ఫేస్‌బుక్‌ ఇటీవల ప్రవేశపెట్టిన ఫ్రీబేసిక్స్‌ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. దీంతో దీనిని భారత్‌లో నిలిపేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ స్పష్టంచేసింది. ట్రాయ్‌ నిర్ణయంపై ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ నిరాశ వ్యక్తంచేశారు. కానీ ఫ్రీబేసిక్స్‌పై తమ సంస్థ పనిచేస్తుందని, ప్రజల్లో అనుసంధానపరమైన అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తామని జుకర్‌బర్గ్‌ తెలిపారు. అయితే ఆ సంస్థ అధికార ప్రతినిధి భారత్‌ నిర్ణయం నేపథ్యంలో దేశంలో ఫ్రీబేసిక్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మొబైల్‌ డేటా అవసరం లేకుండా పరిమితంగా ఇంటర్నెట్‌ సేవలు అందిచేందుకు ఫ్రీబేసిక్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

English summary

World's Popular Social Networking Site Facebook Withdraws its Free Internet basics in India.This decision was taken by Facebook because of the telecom regulator barring discriminatory pricing of data services.