వివాహిత ప్రాణాన్ని బలిగొన్న ఫేస్ బుక్

Facebook Chatting Kills A Married Woman in Nellore

11:07 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Facebook Chatting Kills A Married Woman in Nellore

సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ఫేస్ బుక్ లో ఫేక్ ఎక్కౌంట్లు, ఫేక్ ఫోటోలు పెట్టి చాటింగ్ చేయడం వలన ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు విన్నాం. తాజాగా ఫేస్ బుక్ పరిచయం ఓ వివాహిత ప్రాణాన్ని బలిగొంది. చాటింగ్ లో పరిచయమైన యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం యనమడుగుకు చెందిన పావని(23), బుజబుజ నెల్లూరు చెందిన అహ్మద్ బాషా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పావనికి ఫేస్ బుక్ పై ఆసక్తి ఎక్కువ. ప్రొఫైల్ లో తన ఫొటోకి బదులు మరో అమ్మాయి ఫొటో పెట్టింది. కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన సుజితకుమార్ రెడ్డితో ఫేస్ బుక్ లో ఆమెకు పరిచయమైంది. తనకు వివాహమైందని చెప్పకుండా అతడితో చాటింగ్ చేసింది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ ఆమె అకౌంట్లో డబ్బులు వేసేవాడు. అలా మొత్తం రూ.3లక్షలు వేశాడు. తర్వాత అసలు ఫొటో పెట్టాలని పావనిని అడిగాడు.

అయితే ఆమె పెళ్లికి ముందు ఫొటో పెట్టింది. చివరికి తాను మోసపోయానని తెలుసుకున్నాడు. తన డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. డబ్బుల కోసం సుజిత గురువారం ఫోన్ చేయగా, మదనపల్లి రావాలని చెప్పింది. అక్కడ ఇద్దరూ కలుసుకున్నారు. మన ప్రేమ ఇంతటితో ఆపేద్దాం. ఖర్చు చేసిన డబ్బులు తిరిగిచ్చేయ్ . లేకపోతే కేసు పెడతా’ అని సుజిత్ బెదిరించాడు. దీంతో పావని మనస్తాపానికి గురైంది. రాత్రి 10 గంటలకు భర్తకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి, బస్టాండులోనే పురుగుల మందు తాగింది. సహ ప్రయాణికులు ఆమెను తిరుపతి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: పవన్ మూవీలో ఆలీకి ఝలక్ - సునీల్ ఎంట్రీ

ఇవి కూడా చదవండి: యాక్సిడెంట్ తర్వాత మనిషి ఆత్మ ఇలా గాల్లోకి ...(షాకింగ్ వీడియో)

English summary

A woman named Pavani and a man named Ahmed Basha was loved each other and they married and they were living in Nellore. A Man Named Sujitha Kumar Reddy who belongs to Chittoor District was got contact with pavani on facebook and Sujita Kumar was credited about 3 lakh rupees and later he came to know that Pavani was already got married. So Sujitha Kumar demanded the 3 lakh rupees which was given by him and Pavani committed Suicide because of that.