అదృశ్యమైపోయే మెసేజ్..ఫేస్‌బుక్ కొత్త ఫీచర్

Facebook comes with new features

03:38 PM ON 13th November, 2015 By Mirchi Vilas

Facebook comes with new features

మీరు ఎవరికైనా ఫేస్బుక్లో ఒక మెసేజ్ పంపారనుకోండి అది చూసినవెంటనే ఆ మెసేజ్ అదృశ్యమైపోతే ఎలా ఉంటుంది. ఇప్పటివరకూ స్నాప్చాట్ అనే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్కు మాత్రమే పరిమితమైన ఈ సౌలభ్యాన్ని ఇప్పుడు ఫేస్బుక్ కూడా పరీక్షిస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క వినూత్నమైన ఫీచర్తోనే స్నాప్చాట్ ఫేస్బుక్ ను మించిన ఫాన్స్ ను సంపాదించుకుంది. ఇప్పుుడు ఫేస్బుక్ కూడా సరిగా అలాంటి ఫీచర్నే తన ప్లాట్ఫాం పై కూడా ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం ఇప్పటికే ప్రాన్స్లోని యూజర్లతో కొన్ని ప్రయోగాలు నడుపుతోంది. మీరు ఎవరికైనా మెసేజ్ ను పంపిన ఒక గంటలోపే మెసేజ్ అదృశ్యమైపోతుందని ఫేస్బుక్ చెబుతోంది.

ఈ వినూత్న ఫీచర్తో మరింత మంది యూజర్లను ఆకట్టుకునే పని ఉంది ఆ సంస్థ. లాస్ఆంజిల్స్ కు చెందిన స్నాప్చాట్ కొనేందుకు ఇప్పటికే ఫేస్బుక్ విఫలయత్నం చేసింది. 3బిలియన్ డాలర్లకు అంటే అక్షరాలా 18వేలకోట్ల రూపాయలకు ఫేస్బుక్ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించింది స్నాప్చాట్ సంస్థ. దీంతో స్నాప్చాట్ కు గట్టిపోటీనిచ్చే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ను రూపొందించే పనిలో పడింది. ఇప్పటికే 17బిలియన్ డాలర్ల భారీమొత్తంతో వాట్స్అప్ సొంతం చేసుకున్న ఫేస్బుక్ ఇన్స్టంట్ మెసేజింగ్ రంగంలో ఉన్న అపార అవకాశాలను కొల్లగొట్టేందుకు గట్టి ప్రయత్నమే చేస్తుంది.

English summary

Facebook comes with new features.facebook introduces new feature that is vanished messages.