ఫేస్ బుక్ వివరాలతో వీసా కు లింకు

Facebook Details For America Visa

03:25 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Facebook Details For America Visa

సాధారణంగా అన్నింటికీ ఆధార్ లింక్ అడుగుతున్నారు కదా. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్రగామిగా వున్న ఫేస్ బుక్ వివరాలిస్తే వీసా ఇచ్చేలా లింక్ పెట్టారట. అవును నిజం, ఎవరైనా అమెరికాకు వెళ్లాలనకుంటున్నారా? అయితే వీసా దరఖాస్తు కోసం మున్ముందు ఫేస్ బుక్ , ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలనూ అందజేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ వీసా దరఖాస్తుల్లో ప్రత్యేకించి ఓ సెక్షన్ ను జోడించాలని ఫెడరల్ రిజిస్టర్ కు అమెరికా కస్టమ్స్ , బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇటీవల ప్రతిపాదించింది.

అయితే దరఖాస్తుదారులు తమ పాస్ వర్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దేశ భద్రత దృష్ట్యా ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు తమకు దర్యాప్తులో ఈ విధానం మరింత దోహదం చేయగలదని ఎజెన్సీ అధికారులు ప్రతిపాదనలో పేర్కొన్నారు. కొన్ని దేశాలకు చెందిన పౌరులు 90రోజుల పాటు వీసా రహితంగా అమెరికాలో ఉండేందుకు వీసా వైవర్ ప్రోగాం (వీడబ్ల్యూపీ) అవకాశం కల్పిస్తోంది. కాగా దరఖాస్తులో సందర్శకుల సామాజిక మాధ్యమాల వివరాలను సేకరించడం ద్వారా దుష్టపన్నాగాలకు పాల్పడే వ్యక్తులను పట్టుకునేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. గత నవంబరులో పారిస్ ఉగ్రదాడి అనంతరం వీడబ్ల్యూపీ నిబంధనలను కఠినతరం చేయాలని కాంగ్రెస్ తీర్మానించిన నేపథ్యంలో అధికారులు ఈ ప్రతిపాదన చేయడం ఓ విశేషం. వీసాలో ఈ కొత్త విధానాన్ని నిర్ణీత కాలానికే నిర్దేశించామని, దీనిపై ఆగస్టు 22 వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలను పంపవచ్చని ఫెడరల్ రిజిస్టర్ పేర్కొంది.

మరోవైపు అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ అమెరికా వచ్చే విద్యావంతులకు వరాలు కురిపించారు. తాను ప్రెసిడెంట్ గా ఎన్నికతే.. సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్, పీహెచ్ డీ చేసిన వారికి స్టార్ట్ప్ వీసాతోపాటు స్టాపిల్ గ్రీన్ కార్డ్ పథకాన్ని ప్రవేశపెడతానని ప్రకటించారు. ఈమేరకు ఆమె డెన్వర్ లో ప్రసంగిస్తూ.. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే యువత కోసంఎడ్యుకేషన్ లోన్ ను తీర్చేందుకు మూడేళ్ల వెసులుబాటును కల్పిస్తానని, సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందేందుకు 5జీ వైర్ లెస్, వైర్ లెస్ కంప్యూటర్లను ఆవిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి: హిల్లరీకి ఒబామా తోడు - ప్రచారంలోకి దూకుతున్నారట

ఇవి కూడా చదవండి:దేశాధ్యక్షుడు చెప్పాడని నగ్నంగా పనిచేస్తున్నారు (ఫొటోస్)

English summary

A New Column was introduced in the application for who wants to go America. American Government was taken taken decision that facebook and twitter details of the employee were compulsary.