పాస్‌వర్డ్‌ లేకుండా మీ ఫేస్‌బుక్‌ను తెరవగలరు 

Facebook Employees can Access your Account without Password

03:37 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Facebook Employees can Access your Account without Password

తాజాగా ఫేస్‌బుక్‌ వారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఫేస్‌బుక్‌ సంస్థలోని ఉద్యోగులు నేరుగా మన పాస్‌వర్డ్‌ లేకుండానే మన ఫేస్‌బుక్‌ అకౌంట్లను యాక్సిస్‌ చెయ్యగలరట. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్‌ వారే చెప్పడం విశేషం.

డైరెక్టర్‌ పావో సిలిజమాకి లాస్‌ఎంజిల్స్‌ లోని ఫేస్‌బుక్‌ ఆఫీసులో పర్యటించినప్పుడు అక్కడ ఆఫీసులోని ఉద్యోగులు ఫేస్‌బుక్‌ ను ఎలా ఉపయోగించాలనే విషయం పై పలు సలహాలు ఇచ్చారు. అందులోని ఒక ఉద్యోగి పావో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేస్తే మీకు ఒకేనా అని అడగగా, పావో అంగీకరించాడు. దీంతో ఆ ఫేస్‌బుక్‌ ఇంజనీర్‌ పావో సిలిజమాకి ఖాతాను ఏ విధమైన యుజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ లేకుండా తెరచి ఆశ్చర్య పరిచాడు. దీని తాలుకు నోటిఫికేషన్‌ కానీ పావోకి రాలేదు.

పావో సిలిజమాకి ఈ విషయమై సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ వారిని వివరణ అడగగా, ఫేస్‌బుక్‌ వారు స్పష్టత ఇవ్వలేదు. తమ ఉద్యోగ విధివిదానాల్లో భాగంగా ఇతరుల ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను యాక్సిస్‌ చేసే విధంగా కొన్ని అనుమతులు ఉంటాయని, దీనిలో భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఫేస్‌బుక్‌ వినియోగదారుల నుండి వచ్చే రిక్వస్టులకు స్పందించడానికి తమకి కొంత మేరకు అనుమతి ఉంటుందని తెలిపారు. అందులోని ఉద్యోగులకు ఈ విధానాన్ని తప్పుడు దారిలో ఉపయోగించకుండా ఉండేలా ఫేస్‌బుక్‌ అనేక జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.

English summary

Facebook employees can access one’s account without entering the account detials. Some of the employees have direct access to other accounts