ఫేస్‌బుక్ vs నెట్ న్యూట్రాలిటీ

Facebook Free Basics controversy in India

06:31 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Facebook Free Basics controversy in India

ఇంటర్నెట్ వార్ మొదలైంది. సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్‌కు కష్టకాలం ఎదురుకానుంది. ఉచిత ఇంటర్నెట్ సేవలు కల్పించాలనుకుంటున్న ఫేస్‌బుక్ ప్రయత్నాలకు భారతీయ టెలికాం ఆపరేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫ్రీ బేసిక్స్ ఆఫర్‌ను నిలిపివేయాలని టెలికాం సంస్థలు ట్రాయ్‌ను కోరాయి. ఫ్రీ బేసిక్స్ స్కీమ్ ద్వారా ఫేస్‌బుక్ తన కస్టమర్లకు ఉచిత ఇంటర్నెట్ ఇవ్వాలనుకుంది. రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఫేస్‌బుక్ కస్టమర్లకు ఉచితంగా ఫేస్‌బుక్ సైట్‌ను అందించనుంది. దాంతో పాటు మరి కొన్ని సైట్లను ఉచితంగా కస్టమర్లకు ఇచ్చేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రణాళికకు భారతీయ టెలికాం ఆపరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లంతా సమస్యను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో రిలయన్స్ సంస్థ ప్రస్తుతానికి ఫ్రీ బేసిక్స్ స్కీమ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. నెట్ న్యూట్రాలిటీ సాధించాలనుకుంటున్న ప్రభుత్వం ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్‌కు ఎలా అనుమతి ఇస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెట్ న్యూట్రాలిటీ ద్వారా అన్ని సైట్లను కస్టమర్లకు వేగంగా అందించాలన్నదే లక్ష్యం. కానీ ఫేస్‌బుక్ స్కీమ్‌తో సొంత ప్రచారం తప్ప మరో సైట్‌కు ప్రమోషన్ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో నెట్‌న్యూట్రాలిటీ కోరుతున్న వారంతా ఫ్రీ బేసిక్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. నెట్ న్యూట్రాలిటీ సిద్ధాంతాలు ఫ్రీ బేసిక్స్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రీ బేసిక్స్ ద్వారా కొందరికి మాత్రమే వేగంగా, చౌకగా కొన్ని ఆన్‌లైన్ సైట్లను అందించడం దారుణమని నెట్ న్యూట్రాలిటీ మద్దతుదారులు అంటున్నారు.

English summary

Telecom Operators in India opposes the facebook free internet basics in india. Recently telecom operators requested TRAI to stop free internet basics in India