ఫేస్‌బుక్‌ ఎదుర్కోబోయే ప్రమాదాన్ని కనిపెట్టాడు.. 7 లక్షలు బహుమతి అందుకున్నాడు

Facebook gave a 7 lakhs prize money to a boy

04:12 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Facebook gave a 7 lakhs prize money to a boy

ప్రస్తుత కాలంలో పేస్ బుక్ అంటే తెలియని వారుండరు, పేస్ బుక్ ఎకౌంటు లేని వారుండరు. చిన్న నుంచి పెద్ద దాకా.. పెద్ద నుంచి ముసలి దాకా ఈ పేస్ బుక్ లో ఖాతా తెరుస్తున్నారు. ఇంక ప్రస్తుత యువత గురించి చెప్పక్కర్లేదు, నిత్యం పేస్ బుక్ లో ఉంటూ కాలాన్ని వేల్లదీసుకుంటూ.. సమయాన్ని వృధా చేస్తున్నారు. పేస్ బుక్ లోనే ప్రేమాయణం జరుపుతున్నారు. కానీ కొల్లంకు చెందిన ఇరవై ఏళ్ల యువకుడు మాత్రం ఫేస్‌బుక్ నుంచి 7 లక్షల రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు. ఎస్ అరుణ్ కుమార్ అనే కంప్యూటర్ ఇంజినీర్ స్టూడెంట్ చత్తనూర్‌లోని 'ఎంఈఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌' లో చదువుతున్నాడు.

అతను నిరంతరం పేస్ బుక్ లోనే ఉంటాడు.. అలా ఉండటం వల్ల ఫేస్‌బుక్‌ను కుదిపేసే ఓ బగ్‌ను కనుగొన్నాడు. అరుణ్ కుమార్ తెలియజేసిన వివరాలు ప్రాకారం.. తాను రోజూలాగే ఫేస్‌బుక్‌ను సెర్చ్ చేస్తుంటే లుక్ఎసైడ్.ఫేస్‌బుక్‌.కామ్ అనే డొమైన్ కనిపించిందని, ఈ డొమైన్‌కు ఫుల్ అకౌంట్ టేకోవర్ అనే మాల్ ఫంక్షన్ అఫెక్ట్ అయినట్లు తాను గుర్తించానని చెప్పాడు. దీంతో హ్యాకర్లు పది నిమిషాల్లోనే ఇతరుల ఫేస్‌బుక్‌ అకౌంట్లలోకి అక్రమంగా చొరబడవచ్చునని తెలియజేసాడు. తాను ఈ ఏడాది మార్చి నెలలో దీనిని గుర్తించానని, ఫేస్‌బుక్‌ అధికారులు తొలుత ఈ లోపాన్ని అంగీకరించలేదని చెప్పాడు.

అనేకసార్లు చెప్పిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించారన్నారు. దీనితో ఇతనికి ఫేస్‌బుక్ ప్రైజ్ మనీ ఇచ్చింది. అతను బగ్‌ను కనుగొని చెప్పినందుకు ఈ బహుమతి ఇచ్చారు. అతనికి బహుమతితో పాటు ప్రశంసలు కూడా లభించాయి. ఫేస్‌బుక్‌ నుంచి ప్రశంసలు అందుకోవడం తనకు ఇదే తొలిసారి కాదన్నాడు. ఫేస్‌బుక్‌ భద్రతా లోపాల గురించి చెప్పడంతో తనను 2014, 2015 సంవత్సరాల్లో 'ఫేస్‌బుక్‌ హాల్ ఆఫ్ ఫేమ్‌' లో చేర్చిందన్నాడు. మొత్తం మీద చిన్న వయసులోనే ఇతగాడు పేస్ బుక్ నుండి 7 లక్షల బహుమతిని అందుకున్నాడు.

English summary

Facebook gave a 7 lakhs prize money to a boy. A 20 years engineering student of MES institute of technology invented a bug in Facebook. For that facebook gave a 7 lakhs prize money to that boy.