ఫేస్ బుక్ అధినేతని చంపేశారు(వీడియో)

Facebook killed Mark Zuckerberg

11:30 AM ON 14th November, 2016 By Mirchi Vilas

Facebook killed Mark Zuckerberg

ఈమధ్య కొందరు హీరోలు బతికున్నా వాళ్ళు చనిపోయినట్లు సోషల్ మీడియాలో రావడం, ఆతర్వాత తాము బతికేవున్నామంటూ సదరు నటులు మీడియాముందు గొల్లుమనడం చూస్తున్నాం. అయితే ఏకంగా ఫేస్ బుక్ అధిపతిని స్వయంగా ఫేస్ బుక్ చంపేసింది. అయితే వాస్తవానికి ఇది నిజంగా కాదు. కొన్ని సాంకేతిక తప్పిదాలతో ఫేస్ బుక్ సహవ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ని స్వయంగా ఫేస్ బుక్ నే చనిపోయినవారి జాబితాలో చేర్చడమే ఇందుకు కారణం.. మార్క్ ని అభిమానించేవాళ్లు అతడి ఫేస్ బుక్ పోస్ట్ లను గుర్తు చేసుకుందాం. ఈ సందర్భంగా అతడ్ని ఓసారి స్మరించుకుందాం అని జుకర్ బర్గ్ ప్రొఫైల్ కి ఒక సందేశం కూడా జోడించింది.

తర్వాత పొరపాటు దిద్దుకున్న ఫేస్ బుక్ యాజమాన్యం దీన్ని ఘోర తప్పిదంగా ప్రకటించినా అప్పటికే అంతర్జాలంలో మార్క్ కి అశ్రు నివాళులు, వ్యంగ్య వ్యాఖ్యానాలు పోటెత్తాయి. ఇలా ఇరవైలక్షల ఖాతాల్లో సంస్మరణ సందేశాలుంచారని మీడియా పేర్కొంది. ఈ తప్పిదంపై నెటిజన్లు వేగంగా స్పందించారు. పాపం మార్క్ అని ఒకరు సానుభూతి తెలపగా.. జుకర్ బర్గ్ చాలామంచి అబ్బాయి. అతడికి ఇలా జరగకుండా ఉండాల్సింది అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

1/1 Pages

English summary

Facebook killed Mark Zuckerberg