ఫేస్ బుక్ కి మీ గురించి తెలిసిన రహస్యాలు ఇవే!

FaceBook knows these secrets about you

11:03 AM ON 12th September, 2016 By Mirchi Vilas

FaceBook knows these secrets about you

ఫేస్ బుక్ వాడటంతో మనం మనకి తెలియకుండానే అవసరానికి మించి మన వ్యక్తిగత విషయాలను బయటపెడుతున్నాం. మీరు కలలో కూడా ఊహించలేనంత మీ గురించి ఫేస్ బుక్ కి తెలుసు అంటే నమ్ముతారా?? నమ్మక తప్పదు మరి!! మనలో కొంత మందికి తెలిసిన విషయం ఏంటంటే... ఫేస్ బుక్ లో మనం ఏం చూస్తామో దాని బట్టే మనకు యాడ్స్ కనిపిస్తాయని. దీని అడ్వటైజింగ్ టాక్టిక్స్ అంటాం అని కూడా అంటారు కదా. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే... మనం మన గురించి ఎన్నో విషయాలు ఫేస్ బుక్ కి తెలియజేస్తున్నాం.

ముఖ్యంగా కొన్ని విషయాలు మనం మనకు తెలియకుండా ఫేస్ బుక్ కి ఇచ్చేస్తున్నాం. అసలు విషయం ఏంటంటే ఈ వివరాలను ఫేస్ బుక్ వారు తీసుకోకుండా చేయలేము కూడా. ఒకవేళ ఇలా జరగకుండా ఉండాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఫేస్ బుక్ ని వాడటం మానేయాలి. ఈ రోజుల్లో అది సాధ్యమంటారా? మరి ఏమి చేయాలి. అందరూ ఆలోచిస్తూ, అసలు మనం ఇచ్చే విషయాలు ఏమిటో చూద్దాం..

1/11 Pages

1. మీరు ఉండే ప్రదేశం

2. వయసు

3. మీరు ఏ తరానికి చెందిన వాళ్ళో

4. మీరు ఆడవారా లేక మగవారా

5. మీ మాతృ భాష - మీకు తెలిసిన ఇతర భాషలు

6. మీ చదువు

7. మీరు ఏ డిగ్రీలో ప్రాముఖ్యత సాధించారో

8. మీ స్కూల్

9. మీరు ఏ జాతికి చెందిన వారో

10. మీ సంపాదన

English summary

FaceBook knows these secrets about you