పేస్ బుక్ లో ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోమంటే ఆమెను ఏం చేసాడో తెలుసా?

Facebook lover killed his girlfriend cruelly

11:01 AM ON 30th May, 2016 By Mirchi Vilas

Facebook lover killed his girlfriend cruelly

మలక్ పేట ప్రాంతానికి చెందిన మల్లేశ్ యాదవ్ కూతురు జానకి(26) చదువు పూర్తి చేసుకుని ఓ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తోంది. ఇదిలా ఉంటే ఆమెకు ఏడాది క్రితం నల్గొండ జిల్లా పెద్దకాపర్తికి చెందిన యశ్వంత్ గౌడ్ (27)తో ఫేస్బుక్ లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. యశ్వంత్ గౌడ్ ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం నాగోల్లో ఉంటూ ట్యాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు. జానకిని ప్రేమిస్తున్నాని నమ్మించి, ఆమె దగ్గర డబ్బు తీసుకునేవాడు. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ జానకి యశ్వంత్ గౌడ్ పై ఒత్తిడి తెచ్చింది. దీంతో యశ్వంత్ గౌడ్ జానకకి దూరంగా ఉండటం మొదలు పెట్టాడు.

యశ్వంత్ తనను మోసం చేస్తున్నాడని అర్ధం చేసుకున్న జానకి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యశ్వంత్ గౌడ్ ను హెచ్చరించింది. మే 17న యశ్వంత్ జానకితో ఎంతో ప్రేమగా మాట్లాడి తన గదికి తీసుకెళ్లాడు. గదిలో ఆమెను దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటి పై ఉన్న బంగారు నగలు తీసుకొని, మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి, అర్ధరాత్రి వేళ గౌరెల్లి సమీపంలో మూసీనదిలో పడేశాడు. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో జానకి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మొదటిసారి తనకేమీ తెలియదన్న యశ్వంత్ రెండోసారి అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించాడు.

జానకి కాల్ డేటా, ఆమె ఫేస్బుక్ అకౌంట్, మెయిల్స్, వాటిలో వీరిద్దరి సంభాషణ ఆధారంగా నింధితుడు యశ్వంతేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం నాడు మూసీ నది నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించామని, యశ్వంత్ను అరెస్ట్ చేశామని సుల్తాన్బజార్ ఏసీపీ గిరిధర్ తెలిపారు. జానకి హత్య విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

English summary

Facebook lover killed his girlfriend cruelly