కొత్త .. కొత్తగా.. ఫేస్ బుక్ మెసెంజర్ .. త్వరలో అప్ డేట్

Facebook Messenger Redesign

12:06 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Facebook Messenger Redesign

సోషల్ మీడియా రంగంలో అగ్రగామిగా వున్న ఫేస్ బుక్ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ అప్ డేట్ అవుతోంది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ మెసెంజర్ ని రీడిజైన్ చేశారు. ఈ యాప్ లో ఇప్పుడు కొత్తగా హోం ట్యాబ్ , బర్త్ డే, ఫేవరెట్ సెక్షన్ తదితర ఫీచర్లు వచ్చి చేరాయి. ఇంటర్ఫేస్ కూడా కొత్తగా మారింది. తాజా అప్ డేట్ ద్వారా ఈ కొత్త మెసెంజర్ అందరికీ అందుబాటులోకి వస్తుందని మెసెంజర్ టీం బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ యాప్ వినియోగదారులు మరింత సులభంగా వాడుకునేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ అప్ డేట్ వస్తుందని ప్రకటించింది.

దీనివలన మెసెంజర్ వినియోగదారుల్లో మనం ఎక్కువగా చాట్ చేసుకునే వారిని షార్ట్ లిస్ట్ చేసుకునేందుకు వీలుగా ‘ఫేవరెట్ సెక్షన్ ’ ఉపయోగపడుతుంది. అలాగే మెసెంజర్ లో ‘యాక్టివ్ నౌ’ అనే ఆప్షన్ సైతం కనిపిస్తుంది. ఎవరెవరు మెసెంజర్ లో ఆన్ లైన్ లో ఉన్నారో తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. పుట్టిన రోజుల్ని గుర్తు చేయడానికి వీలుగా ‘బర్త్ డే’ సెక్షన్ ఉపయోగపడుతుంది. మొత్తానికి సరికొత్త గా ఫేస్ బుక్ రూపాంతరం చెందుతోంది.

ఇది కూడా చూడండి: రూ. 500 నోట్లను తప్పుగా ముద్రించారా? లేక దొంగ నోట్లా..

ఇది కూడా చూడండి: ఎఎస్పీ శశికుమార్ డెత్ కు కారణం ఏమిటి?

ఇది కూడా చూడండి: ఎవరెన్ని అనుకున్నా ... నేనిప్పటికీ అందగత్తెనే

English summary

Facebook Messenger 's instant messaging app has been redesigned.