త్వరలో ఫేస్‌బుక్ పోస్ట్‌ అలర్ట్స్

Facebook new feature, With this you can alert your friends with new posts Coming Soon

05:50 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Facebook new feature, With this you can alert your friends with new posts Coming Soon

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ తన యూజర్ల కోసం త్వరలో ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.

దీని ద్వారా యూజర్లు తాము కావాలనుకున్న వారికి చెందిన పోస్ట్‌ల అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అయితే కేవలం వెరిఫై చేసిన ప్రొఫైల్స్ కలిగిన యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్ అందించనుంది. ఇది యాక్టివేట్ అయితే ప్రొఫైల్ పిక్చర్‌పై ఒక బ్లూ కలర్ చుక్క దర్శనమిస్తుంది. దీని ద్వారా యూజర్లు తమకు కావల్సిన వారికి చెందిన పోస్ట్‌లకు అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు ఫేస్‌బుక్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఫీచర్ వల్ల న్యూస్ ఫీడ్‌లోని పోస్ట్‌లు అన్నింటినీ చూడకుండా యూజర్లు తమకు ఇష్టమైన వారి పోస్ట్‌లనే చూడవచ్చని, పోస్ట్‌ల మధ్యలో యాడ్స్ కనిపించే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని అంటున్నారు.

English summary

Facebook testing its new feature called alerts, With this you can alert your friends with new posts. With this feature you no need to go and check in new feed.