ఫేస్‌బుక్ సెక్యూరిటీ టూల్..

Facebook New Security Tool

04:41 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Facebook New Security Tool

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ తాజాగా ఒక సెక్యూరిటీ చెకప్ టూల్‌ను విడుదల చేసింది. ఇటీవలే డెస్క్ టాప్ వెర్షన్ వాడుతున్న వారి కోసం ఈ టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆండ్రాయిడ్ డివైస్‌లలో ఫేస్‌బుక్‌ను వాడుతున్న యూజర్ల కోసం కూడా సెక్యూరిటీ టూల్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమ తమ ఫేస్‌బుక్ అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇందు కోసం యూజర్లు తమ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఫేస్‌బుక్ యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే చాలు, ఈ టూల్‌ను వాడుకోవచ్చు. ఐఓఎస్ యూజర్లకు త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యూజర్లు 3 విధాలుగా తమ ఫేస్‌బుక్ ఖాతాలను జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. యూజర్లు తాము లాగిన్ అయి ఉండి కూడా వాడకుండా ఉన్న ఇతర డివైస్‌లలోని ఫేస్‌బుక్ అకౌంట్ల నుంచి సులువుగా లాగవుట్ అవచ్చు. ఇతరులెవరైనా మీకు తెలియకుండా మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలని చూస్తే ఈ-మెయిల్ ద్వారా అలర్ట్ వస్తుంది. యూజర్లు తమ ఫేస్‌బుక్ అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకునేందుకు సాయపడుతుంది.

English summary

Famous social networking site facebook introduced its new security tool secure our facebook accounts