ఫేస్‌బుక్‌ కార్యాలయంపై దాడి

Facebook Office Attcaked In Germany

05:34 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Facebook Office Attcaked In Germany

జర్మనీలోని ఫేస్ బుక్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. హాంబర్గ్ లోని ఫేస్ బుక్ కార్యాలయంపై దాదాపు 20 మంది దాడి చేసి అద్దాలు పగలగొట్టి, పెయింట్ చల్లారు. కార్యాలయం ప్రవేశద్వారం వద్ద 'ఫేస్ బుక్ డిజ్ లైక్' అని రాసినట్టు జర్మన్ మీడియా వెల్లడించింది. దాడి చేసిన దుండగులు నల్లటి దుస్తులు, ముసుగులు ధరించినట్టు హాంబర్గ్ పోలీసులు చెప్పారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యల వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని జర్మనీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జాతిని రెచ్చగొట్టే ప్రసంగాలను తొలగించడంలో విఫలమైనందుకు ఫేస్ బుక్ యూరప్ విభాగం చీఫ్ జర్మనీలో విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా జర్మనీ చట్టాలను తాము ఉల్లంఘించలేదని ఫేస్ బుక్ ప్రతినిధి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

English summary

Some attackers damaged Facebook's offices in Hamburg in Germany, smashing glass, throwing paint and spraying "Facebook dislike" on a wall