పేస్ బుక్ లో చర్చ జరిగిన టాప్ పది అంశాలివే

Facebook Release Top Trending Topics In 2016

11:46 AM ON 10th December, 2016 By Mirchi Vilas

Facebook Release Top Trending Topics In 2016

సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ఫేస్ బుక్ లో ఈ ఏడాది మనవాళ్లు ఎక్కువగా దేనిగురించి మాట్లాడుకున్నారో తెలుసా? ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కదా. ఓసారి మొత్తం పేజీలను తిరగేస్తే, చీకట్లను పారదోలే దీపపు కాంతుల దీపావళి గురించే ఎక్కువమంది చర్చించుకున్నారట. ఈవిషయం ఫేస్ బుక్ వెల్లడించింది. భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ లో చర్చించుకున్న తొలి పది అంశాల జాబితాను ‘ఫేస్ బుక్ 2016 రివ్యూ’ పేరుతో విడుదల చేసింది.

మనదేశంలో చర్చకు వచ్చిన అంశాల్లో దీపావళి అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానంలో క్రికెట్ నిలిచింది.

మూడోస్థానంలో ఉరీ ఉగ్రదాడి, నాలుగో స్థానంలో పీవోకేలో భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులు నిలిచాయి.

ఆ తర్వాత వరుసగా టీమిండియా స్కిప్పర్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ధోని’ సినిమా, ప్రముఖ డీజే హార్డ్ వెల్ భారత పర్యటన, ప్రియాంక చోప్రా, రియో ఒలింపిక్స్, పోకెమాన్ గో, పఠాన్ కోట్ ఉగ్రదాడి, ఐఫోన్7 విడుదల గురించి భారతీయులు ఎక్కువగా చర్చించినట్టు ఫేస్ బుక్ తెలిపింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రెగ్జిట్, పోకెమాన్ గో, ఒలింపిక్స్ వంటివి టాప్ -10లో చోటు దక్కించుకున్నాయి.

ఇది కూడా చూడండి: నోట్ల రద్దు యవ్వారం ఆ రెండు గదుల్లోనే సాగిందట

ఇది కూడా చూడండి: అమ్మ మరణంపై అనుమానాలు - సంధించిన 8 ప్రశ్నలు

English summary

Facebook Release Top Trending Topics In 2016 Review.