యూజర్లకు సారీ చెప్పిన 'ఫేస్ బుక్'

Facebook says sorry to Facebook users

05:52 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Facebook says sorry to Facebook users

ఫేస్ బుక్ పెట్టిన సేఫ్టీ చెక్ నోటిఫికేషన్ వల్ల యూజర్లు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో యూజర్లకు ఫేస్ బుక్ క్షమాపణ చెప్పింది. పాకిస్థాన్ లోని లాహోర్ లో ఆదివారం జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం సేఫ్టీ చెక్ నోటిఫికేషన్ ను ఫేస్ బుక్ యాక్టివేట్ చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్ బుక్ యూజర్లందరినీ వేధించింది. చాలా మంది యూజర్లు దీని పై అసహనం వ్యక్తం చేశారు. కొందరైతే ఈ నోటిఫికేషన్ స్క్రీన్ షాట్లను తీసుకొని ట్విటర్ లో షేర్ చేశారు. ప్రకృతి విపత్తులు, ఉగ్రవాద దాడులు సంభవించినపుడు ఈ నోటిఫికేషన్ ను ఫేస్ బుక్ యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారికి మాత్రమే ఈ నోటిఫికేషన్ చేరే విధంగా దీనిని రూపొందించవచ్చు.

ఇది కూడా చదవండి: కాజల్ విప్పి చూపిస్తానంటే పవన్ వద్దన్నాడట

తాము క్షేమంగానే ఉన్నామని బంధుమిత్రులకు తెలియజేయడానికి యూజర్లు ఉపయోగించుకోవాలన్నది ఫేస్ బుక్ ఉద్దేశం. కానీ ఆదివారం అనూహ్యంగా ఈ సేఫ్టీ చెక్ ప్రపంచవ్యాప్తంగా యూజర్లను తెగ ఇబ్బంది పెట్టేసింది. దీంతో ఫేస్ బుక్ డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్ మెంట్ స్పందిస్తూ, సంక్షోభం ప్రభావం లేని వారికి కూడా దురదృష్టవశాత్తూ ఈ నోటిఫికేషన్ వెళ్ళిందని పేర్కొంది. ఈ అనూహ్య పరిణామం తమ ఉధ్ధేసానికి విరుద్ధమని, దిద్దుబాటు చర్యలు తక్షణమే చేసామని, నోటిఫికేషన్ పొరపాటుగా వస్తే క్షమించాలని ఫేస్ బుక్ కోరింది. మొత్తానికి ఈ వివరణతో యూజర్లు వాస్తవం తెలుసుకునే సావకాశం వచ్చిందని పలువురు యూజర్లు స్పందించారు.

English summary

Facebook says sorry to Facebook users. Facebook chairman says sorry to their users.