ఫేస్‌బుక్ నుంచి కొత్త బ్రౌజర్

Facebook To Launch New Web

01:05 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Facebook To Launch New Web

ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ దిగ్గజం ఫేస్‌బుక్ ఓ కొత్త ఇంటర్నెట్ బ్రౌజర్‌ను త్వరలోనే తన యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఫేస్‌బుక్ యాప్‌కు అనుసంధానంగా పనిచేసే ఈ బ్రౌజర్‌ను ఆ సంస్థ ఇప్పటికే తయారు చేయగా ప్రస్తుతం అది టెస్టింగ్ దశలో ఉంది. ప్రస్తుతం ఆయా స్మార్ట్‌ఫోన్లలో ఉన్న ఫేస్‌బుక్ యాప్‌లో యూజర్లు షేర్ చేసే లింక్‌లను ఓపెన్ చేస్తే యాప్ నుంచి బయటకి రావల్సి వస్తుంది. అయితే ఫేస్‌బుక్ అందించనున్న కొత్త బ్రౌజర్‌తో ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాప్‌లోనే కింది భాగంలో ఆయా వెబ్‌సైట్‌ల లింక్‌లను ఓపెన్ చేసుకునేందుకు వీలు కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ యూజర్లకు ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉండగా, త్వరలో దీన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది అన్ని ప్లాట్‌ఫాంలకు చెందిన యూజర్లకు అందించనున్నారు.

English summary

Worlds Popular social networking site Facebook to launch a new browser.Presently this browser was in testing stage.The browser is only available for iOS users only