ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌లోకి ఫేస్‌బుక్

Facebook Transport Service

06:47 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Facebook Transport Service

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఫేస్ బుక్ ఖాతా కలిగిన వినియోగదారులు నేరుగా క్యాబ్ సర్వీస్‌లను బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు ఫేస్‌బుక్ ప్రముఖ క్యాబ్ ఆపరేటర్ ఉబర్‌తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఫేస్‌బుక్ వినియోగదారులు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌ల ద్వారా నేరుగా క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఉబర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ఉండాలి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ సేవలు ఇప్పుడు ప్రారంభం కాగా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లను ప్రారంభించనున్నామని ఫేస్‌బుక్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాల్లో రవాణా సేవలను అందించే ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని అంటున్నారు. అంటే త్వరలోనే మనదేశంలోనూ ఫేస్‌బుక్ నుంచే క్యాబ్‌లను బుక్ చేసుకునే సదుపాయం రాబోతుందన్నమాట..

English summary

Social Networking site Facebook launches its new transport feature. Facebook joined with famous cab services Uber. We can directly book uber cabs from facebook directly